ఆర్నెల్ల ముందు ఇస్తే గెలిచేవాళ్లం: డీఎస్ | Give six months before the win in telengana : DS | Sakshi
Sakshi News home page

ఆర్నెల్ల ముందు ఇస్తే గెలిచేవాళ్లం: డీఎస్

May 29 2014 2:10 AM | Updated on Mar 18 2019 9:02 PM

ఆర్నెల్ల ముందు ఇస్తే గెలిచేవాళ్లం: డీఎస్ - Sakshi

ఆర్నెల్ల ముందు ఇస్తే గెలిచేవాళ్లం: డీఎస్

ఎన్నికలకు ఆరు నెలల ముందు తెలంగాణ ఇచ్చి ఉంటే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేదని పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి చెప్పినట్టు పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ తెలిపారు.

న్యూఢిల్లీ : ఎన్నికలకు ఆరు నెలల ముందు తెలంగాణ ఇచ్చి ఉంటే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేదని పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి చెప్పినట్టు పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ తెలిపారు. సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారన్న అభిమానం ప్రజల్లో ఉన్నా, తన పోరాటంతోనే సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వాల్సి వచ్చిందని చెప్పడంలో కేసీఆర్ సఫలీకృతుడయ్యారన్నారు.

బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ను కలిసిన అనంతరం డి.శ్రీనివాస్ ఏపీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. పార్టీ ఓటమికిగల కారణాలు, వాటిని సరిదిద్దుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలను సోనియాకి వివ రించినట్టు తెలిపారు.  కేసీఆర్, టీఆర్‌ఎస్ ఉద్యమ ఫలితంగానే ఆపార్టీ గెలిచిందన్నారు. హైదరాబాద్‌తో సహా కొన్ని ప్రాంతాల్లో సెటిలర్లకు, మైనార్టీలకు నమ్మకం కల్పించలేకపోయామని డీఎస్ అంగీకరించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement