తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్లొచ్చేలోపు ఇంట్లో ఉన్న బాలిక అదృశ్యమైంది.
బాలిక అదృశ్యం
Jun 5 2016 8:49 PM | Updated on Mar 28 2018 11:26 AM
పరిగి (రంగారెడ్డి): తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్లొచ్చేలోపు ఇంట్లో ఉన్న బాలిక అదృశ్యమైంది. రంగారెడ్డి జిల్లా పరిగి మండల పరిధిలోని రూప్‌ఖాన్‌పేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్‌ఐ హన్మంతు తెలిపిన వివరాల ప్రకారం... గుడిసె రాములు, భార్యతో కలసి ఈ 3వ తేదీన కూలీ పనులకు వెళ్లాడు. సాయంత్రం ఇంటికి తిరిగి రాగా కుమార్తె ఉమారాణి(15) కనిపించలేదు. బంధువులు, తెలిసినవారి వద్ద విచారించినా ఆచూకి లభించలేదు.
దీంతో ఆదివారం పరిగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ హన్మంతు తెలిపారు. శేఖర్ అనే యువకుడు తన బైక్‌పై బాలికను తీసుకెళ్లినట్టు తెలిసిన వారు చెప్పడంతో... పోలీసులు అతడ్ని విచారించారు. తన బండిపై వచ్చిన మాట వాస్తవమేనని తరువాత పరిగిలో దిగి ఎటు వెళ్లిందో తెలియదని అతడు పోలీసులకు వివరణ ఇచ్చాడు. దీంతో బాలిక అదృశ్యం మిస్టరీగా మారింది.
Advertisement
Advertisement