వినూత్న ప్రచారం సరే.. ఇదేమీ నిర్లక్ష్యం?

GHMC Staff Campaign in Hussain Sagar for Voter awareness - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఓటర్లకు అవగాహన కల్పించేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు వినూత్న ప్రచారం నిర్వమించారు. హుస్సేన్‌ సాగర్‌లో బోటు మీద ప్రయాణించి.. బుద్ధ విగ్రహం వద్దకు చేరుకున్న అధికారులు.. ఈ నెల 25వ తేదీ వరకు కొత్తవారు ఓటర్లుగా నమోదుచేసుకోవాలని, ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందో లేదో తెలుసుకోవాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రచారం నిర్వహించారు.

ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఈ వినూత్న ప్రచారంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారు. సెఫ్టీ జాకెట్లు వేసుకోకుండానే ఓ ఐఏఎస్‌ అధికారితోపాటు 50 మంది జీహెచ్‌ఎంసీ ఉద్యోగులు బోటులో ప్రయాణించారు. బోటులో సెఫ్టీ జాకెట్లు ఉన్నా.. వారు ధరించలేదు. అందరూ జాగ్రత్తగా ఉండాలని, ప్రాణాల మీదకు చేటు తెచ్చే ప్రమాదాల విషయంలో అప్రమత్తంగా ఉండి తగిన ముందుజాగ్రత్తలు తీసుకోవాలని నిత్యం చెప్పే అధికారులే.. తమదాకా వస్తే నిర్లక్ష్యంగా వ్యవహరించడం చర్చనీయాంశమైంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top