పరిహారం...  నాలుగింతలు

GHMC Plans To Overcome The Financial Difficulties of Land Acquisition In Telangana - Sakshi

సుందరీకరణ పనులకు కొత్త ప్రణాళిక

సొమ్ము చెల్లింపులకు బదులు అభివృద్ధి హక్కు బదిలీ పత్రాల వినియోగం

నాలా స్థలాలకూ 200% నుంచి 400 శాతానికి పెంచుతూ టీడీఆర్‌ పత్రాలు

నిధుల లేమితో జీహెచ్‌ఎంసీ కొత్త చూపు...ప్రభుత్వానికి ప్రతిపాదనలుబం

సాక్షి, హైదరాబాద్‌: వివిధ అభివృద్ధిపనుల్లో భూసేకరణకు గాను ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బందులను అధిగమించి ముందుకు వెళ్లేలా జీహెచ్‌ఎంసీ ప్రణాళిక రచిస్తోంది. స్థలాల సేకరణకు పరిహారంగా నగదు చెల్లింపు బదులు అభివృద్ధి హక్కు బదిలీ పత్రాల్లో వెసులుబాటు కలి్పస్తూ సుందరీకరణ చేపట్టాలని భావిస్తోంది.ఇలా ఎస్పార్‌డీపీ(వ్యూహాత్మక రహదారుల పథకం)లో భాగంగా చేపట్టిన ఫ్లై ఓవర్లు, జంక్షన్ల అభివృద్ధి తదితర పనుల భూసేకరణల కోసం జీహెచ్‌ఎంసీ ఖజానా నుంచి నిధులు చెల్లించకుండా అభివృద్ధి హక్కు బదిలీ పత్రాలను అంటే టీడీఆర్‌ (ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ రైట్స్‌) తీసుకునేలా స్థల యజమానులను ప్రోత్సహిస్తోన్న జీహెచ్‌ఎంసీ.. నాలాల విస్తరణ, చెరువుల బఫర్‌జోన్‌ల సుందరీకరణ కోసం సైతం ఈ విధానాన్ని అనుసరించనుంది. ఇందులో భాగంగా యజమానులు కోల్పోయే భూములకు ప్రస్తుతం కలి్పస్తున్న 200% ఉన్న టీడీఆర్‌ హక్కులను 400 శాతానికి పెంచేందుకు సిద్ధమైంది. ఫ్లై ఓవర్లు, జంక్షన్ల వంటి సాధారణ ప్రాంతాల్లో ఆస్తులు/భూములు సేకరించినప్పుడు ఈ విధానం అమల్లో ఉంది. చెరువులు, నాలాల ప్రదేశాల్లో మాత్రం ఇది కేవలం 200% మాత్రమే ఉంది.

నగర అవసరాలకోసం నాలాలను విస్తరించాల్సి ఉంది. అందుకుగాను భూములిచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. భూసేకరణ చట్టం మేరకు నోటిఫికేషన్‌తో అమలుచేసే ఆర్థిక స్థితిలో జీహెచ్‌ఎంసీ లేదు. దీంతో గతేడాది కాలంగా టీడీఆర్‌ పద్ధతిపై ముమ్మర ప్రచారం చేయడంతోపాటు భూ యజమానులను ఒప్పించడంలో పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు సఫలమయ్యారు. ప్రస్తుతం ఉన్న 200% టీడీఆర్‌ను 400% చేస్తే ముందుకొస్తారని భావిస్తున్నారు. ఈమేరకు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించినట్లు మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తెలిపారు. అనుమతి వస్తే ఫ్లై ఓవర్ల తరహాలోనే చెరువుల బఫర్‌జోన్ల సుందరీకరణ, నాలాల విస్తరణ పనులకు టీడీఆర్‌ను ఎక్కువగా వినియోగించుకోవాలని భావిస్తున్నారు. తద్వారా వాటిని అభివృద్ధిచేసేందుకు, పచ్చదనం పెంచేందుకు మార్గం సుగమం కాగలదని భావిస్తున్నారు.దీనివల్ల నాలాల విస్తరణతోపాటు చెరువుల పరిరక్షణకు, వాటిని వినోదకేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు వీలవుతుందని మేయర్‌ అన్నారు. 

బతుకమ్మ చెరువుల సుందరీకరణ.. 
 వినాయక నిమజ్జనాలతోపాటు బతుకమ్మల నిమజ్జనాల కోసం జీహెచ్‌ఎంసీ ఏర్పాటుచేసిన 32 చెరువుల ను కూడా తీర్చిదిద్దనున్నారు. ఇకపై నిర్మించబోయే నిమజ్జన కొలనుల్ని 5 ఎకరాలు, అంతకంటే ఎక్కువ స్థలంలో నిర్మించాలని భావిస్తున్నారు. వీటిలో ఐదారడుగుల పెద్ద గణేశ్‌ విగ్రహాలను కూడా నిమజ్జనం చేయవచ్చునని, తద్వారా హుస్సేన్‌సాగర్‌కు వెళ్లే పెద్ద విగ్రహాల సంఖ్య తగ్గుతుందని అంచనా.  

టీడీఆర్‌ అమలు ఇలా.. 
వివిధ ప్రాజెక్టులు చేపట్టేప్పుడు ప్రభుత్వం అవసరమైన ఆస్తులు, భూసేకరణకు పరిహారంగా నగదు చెల్లించడం తెలిసిందే. నగరంలో భూముల విలువ ఎక్కువ కావడంతో ఆస్తులు కోల్పోయే వారికి నగదుకు బదులు వారు కోల్పోయే భూమికి నాలుగు రెట్ల బిల్టప్‌ ఏరియాతో మరో స్థలంలో నిర్మాణం చేసుకునేందుకు వెసులుబాటు కలి్పస్తూ ఇచ్చేవే ఈ హక్కు (టీడీఆర్‌) పత్రాలు. వీటితో హక్కుదారులు తాము కోల్పోయిన ప్లాట్‌ఏరియా బిల్టప్‌ ఏరియాకు నాలుగింతల బిల్టప్‌ ఏరియాను పొందవచ్చు. అందుకుగాను నిరీ్ణత సెట్‌బ్యాక్‌ వదలకుండానే అదనపు అంతస్తు వేసుకోవచ్చు.ఆయా ప్రాంతాల్లోని రిజి్రస్టేషన్‌ విలువ కనుగుణంగా నగరంలోని ఏ ప్రాంతంలోనైనా ఈ నిర్మాణం చేసుకోవచ్చు. లేదా తమకున్న ఈ హక్కుల్ని బిల్డర్లకు అమ్ముకోవచ్చు.ఈ ప్రయోజనాలు ఆకట్టుకోవడంతో దాదాపు 325 మంది టీడీఆర్‌ సరి్టఫికెట్లు తీసుకోవడం ద్వారా జీహె చ్‌ఎంసీకి రూ. 200 కోట్ల వరకు చెల్లింపులు మి గిలాయి. చెరువులు, నాలాల ప్రాంతాల్లో ప్రస్తు తం టీడీఆర్‌ పరిహారం 200% మాత్రమే ఉంది. దాన్ని 400 శాతానికి పెంచితే ఎక్కువ మంది ముందుకొస్తారని.. జీహెచ్‌ఎంసీ అంచనా.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top