ఆ ఏడు సంస్థలకు జీహెచ్‌ఎంసీ నోటీసులు | Sakshi
Sakshi News home page

ఆ ఏడు సంస్థలకు జీహెచ్‌ఎంసీ నోటీసులు

Published Sat, Jan 18 2020 5:30 PM

GHMC Given Notice To Seven Agencies In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ పరిధిలో నిబంధనలను అతిక్రమించి పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన టాప్‌ ఏడు సంస్థలకు జీహెచ్‌ఎంసీ నోటీసులు జారీ చేసింది. ఇంతకుముందే భారీగా జరిమానా విధించినా ఆ ఏడు సంస్థలు ఫైన్‌ కట్టకుండా అలసత్వం ప్రదర్శించడంతోనే నోటీసులు జారీ చేసినట్లు జీహెచ్‌ఎంసీ స్పష్టం చేసింది. అయితే ఇదే విషయమై ఈవీడీఎం డైరెక్టర్‌ విశ్వజిత్‌ స్పందిస్తూ.. ఇప్పటికైనా సదరు సంస్థలు వెంటనే జరిమానా కట్టాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా జీహెచ్‌ఎంసీ నోటీసులు జారీ చేసిన ఏడు సంస్థలు వివరాలు ఇలా ఉన్నాయి. 


ది నేచురల్ హెయిర్ ‍ ట్రీట్‌మెంట్ : 39 లక్షల 56 వేలు
ది బ్రిటిష్ స్పోకేన్ ఇంగ్లీష్ : 33 లక్షల 62 వేలు
ది వెంకట్ జాబ్స్ ఇన్ ఎంఎన్ సీ : 29 లక్షల 44 వేలు
యాక్ట్ ఫైబర్ నెట్ : 14 లక్షల 19 వేలు 
ది ర్యాపిడో బైక్ టాక్సి : 13 లక్షల 79 వేలు
ది బిల్ సాఫ్ట్ టెక్నాలజీస్ : 9 లక్షల 38వేలు
ది హత్ వే బ్రాడ్ బాండ్ : 8 లక్షల 13 వేలు

Advertisement
Advertisement