మాజీమంత్రి డీకే అరుణపైన, ఆమె భర్తపైన మహబూబ్నగర్ జిల్లాపరిషత్ చైర్మన్ బండారు భాస్కర్ తీవ్రంగా మండిపడ్డారు.
మాజీమంత్రి డీకే అరుణపైన, ఆమె భర్తపైన మహబూబ్నగర్ జిల్లాపరిషత్ చైర్మన్ బండారు భాస్కర్ తీవ్రంగా మండిపడ్డారు. డీకే అరుణ భర్త డీకే భరతసింహారెడ్డిని మించిన అవినీతిపరుడు అసలు గద్వాలలోనే ఎవరూ లేరని ఆయన అన్నారు.
ఎవరైనా అలా ఉన్నట్లు నిరూపిస్తే.. ఆ వ్యక్తికి రూ. 10 లక్షల రివార్డు ఇస్తామని భాస్కర్ బహిరంగంగా సవాలు చేశారు. ఎమ్మెల్యేగా ఉన్న డీకే అరుణ.. తన భర్త అక్రమ వ్యాపారాలకు రక్షణ కవచంగా ఉపయోగపడుతున్నారని ఆయన ఆరోపించారు.