యువతిపై గ్యాంగ్ రేప్: నిందితులు అరెస్ట్ | Gangrape in warangal district | Sakshi
Sakshi News home page

యువతిపై గ్యాంగ్ రేప్: నిందితులు అరెస్ట్

Apr 19 2015 9:18 AM | Updated on Aug 11 2018 9:10 PM

యువతిపై గ్యాంగ్ రేప్: నిందితులు అరెస్ట్ - Sakshi

యువతిపై గ్యాంగ్ రేప్: నిందితులు అరెస్ట్

వరంగల్ జిల్లా చేర్యాలలో శనివారం అర్థరాత్రి దారుణం చోటు చేసుకుంది.

వరంగల్: వరంగల్ జిల్లా చేర్యాలలో శనివారం అర్థరాత్రి దారుణం చోటు చేసుకుంది.  యువతిపై ఆరుగురు యువకులు సామూహిక అత్యాచారానికి  పాల్పడ్డారు. దాంతో బాధితురాలు ఆమె తల్లిదండ్రులు చేర్యాల పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం....  బాధితురాలి ఇంటి సమీపంలో ఓ యువకుడు... ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంట పడేవాడు. ఆ క్రమంలో శనివారం రాత్రి నీతో మాట్లాడాలి అని చెప్పి ఆమెను బయటకు తీసుకువెళ్లాడు. 

అప్పటికే అక్కడ కాపు కాసిన ఐదుగురు యువకులతో పాటు సదరు యువకుడు కూడా ఆమెపై సామూహిక అత్యాచారం చేసి పరారైయ్యారు. దీంతో బాధితురాలు తల్లిదండ్రులతోపాటు ఆదివారం ఉదయం పోలీసులకు ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి... నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను విచారిస్తున్నామని పోలీసులు చెప్పారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement