'కేసీఆర్ పాలనపై కామెంట్ చేయలేను' | G V Narsing rao birth centenary celebrations at Gandhi bhavan | Sakshi
Sakshi News home page

'కేసీఆర్ పాలనపై కామెంట్ చేయలేను'

Oct 14 2014 1:16 PM | Updated on Jul 11 2019 8:38 PM

'కేసీఆర్ పాలనపై కామెంట్ చేయలేను' - Sakshi

'కేసీఆర్ పాలనపై కామెంట్ చేయలేను'

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ గెలవకపోవడం ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని బాధించిందని మాజీ పీసీసీ చీఫ్, మాజీ మంత్రి ఎమ్మెస్సార్ అన్నారు.

హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ గెలవకపోవడం ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని బాధించిందని మాజీ పీసీసీ చీఫ్, మాజీ మంత్రి ఎం సత్యనారయణ రావు (ఎమ్మెస్సార్) అన్నారు. మంగళవారం హైదరాబాద్లో గాంధీభవన్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి జీవీ నర్సింగరావు శత జయంతి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఎమ్మెస్సార్, పీసీసీ చీఫ్ పొన్నాల, ఎంపీ పాల్వాయి,  నర్సారెడ్డితో పాటు జీవీ నర్సింగరావు కుమారుడు రూపేందర్ రావు పాల్గొన్నారు.

జీవీ నర్సింగరావు సేవలను ఈ సందర్భంగా నాయకులు కొనియాడారు. అనంతరం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటై నాలుగు నెలలే అయింది. అప్పడే కేసీఆర్ పాలనపై కామెంట్ చేయలేనని అన్నారు. పారిశ్రామిక విధానంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని రూపేందర్ రావు స్పష్టం చేశారు. ఆ తర్వాతే స్పందిస్తానని ఆయన చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement