ఐకమత్యంతో పనిచేస్తేనే భవిష్యత్‌

Future Is The Only Way To Work With Unity - Sakshi

పెనుబల్లి : రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని మాజీ మంత్రి జలగం ప్రసాదరావు అన్నారు. కాంగ్రెస్‌ నాయకులు విభేదాలను పక్కనపెట్టి ఐకమత్యంతో పనిచేస్తే మంచి భవిష్యత్‌ ఉంటుందన్నారు. బుధవారం వీయం బంజర్‌లోని జేవీఆర్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ భవనంలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పదవులకోసం కాకుండా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.

కార్యకర్తలు, నాయకులు బాగుంటేనే పార్టీకి మనుగడ ఉంటుందన్నారు. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీల ఆశయ సాధనకు శ్రేణు లు కృషి చేయాలన్నారు. దమ్మపేట మండలం జలవాగు గ్రామంలో గిరిజనులకు ప్రభుత్వం 45 సంవత్సరాల క్రితం జీఓ ద్వారా 15 ఎకరాలు కేటాయిస్తే ఆ భూములకు ఇంతవరకు కొత్త పట్టాదారు పాస్‌ పుస్తకాలు ఇవ్వకపోగా ఆ భూమిని వారికి అప్పజెప్పకపోవడం దారుణమన్నారు.

దళితులకు ఇస్తామన్న మూడెకరాలను ఇచ్చి హామీని కేసీఆర్‌ నిలబెట్టుకోవాలన్నారు. రిజర్వేషన్లు 50 శాతం లోపు ఉండాలని కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ, తదనుగుణంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలు నిర్వహించి మిగిలిన రిజర్వేషన్ల కోసం కోర్టుకు పోతే మంచిదన్నారు.

కార్య క్రమంలో నాయకులు వంకాయలపాటి వెంకటేశ్వరరావు, ముక్కర భూపాల్‌రెడ్డి, వంగా గిరిజాపతిరావు, పసుమర్తి వెంకటేశ్వరరావు, గూడూరు మాధవరెడ్డి, కోమటి ప్రసాదు, కోమటి వెంకటేశ్వరరావు, పంది వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top