30 రోజుల పోరాటం | Sakshi
Sakshi News home page

30 రోజుల పోరాటం

Published Thu, Aug 6 2015 2:15 AM

30 రోజుల పోరాటం

వేతనాలు పెంచాలంటూ మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె 30వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో నేటి నుంచి ఆమరణ దీక్ష చేపట్టేందుకు కార్మికులు సిద్ధమవుతున్నారు. మరోవైపు కార్మికులపై ఒత్తిడిలోకి నెట్టడం ద్వారా సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు ప్రభుత్వం పావులు కదుపుతోంది.
 
నేటి నుంచి ఆమరణ దీక్షలు
- నిరవధికంగా కొసాగుతున్న మున్సిపల్ సమ్మె
- పట్టుబిగిస్తున్న ప్రభుత్వం.. వెనక్కి తగ్గని కార్మికులు..
- పనిచేసిన రోజులకు జీతం చెల్లించని బల్దియా
సాక్షి, హన్మకొండ :
వేతనాలు పెంచాలనే డిమాండ్‌తో 2015 జులై 6వ తేదీ నుంచి మున్సిపల్ ఔట్‌సోర్సింగ్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. గ్రేటర్ వరంగల్‌లతో పాటు జనగామ, మహబూబాబాద్ మున్సిపాలిటీలు, పరకాల, నర్సంపేట, భూపాలపల్లి నగరపంచాయతీల్లో మొత్తం 3,074 మంది కాంట్రాక్టు కార్మికులు ఉండగా వీరిలో 2051 మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. ఏకధాటిగా సమ్మె కొనసాగుతున్నా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన కరువవపోవడంతో అన్ని పురపాలక కార్యాలయ ఎదుట నిరసన, ఆందోళన కార్యక్రమాలు నిత్యకృత్యంగా మారాయి.

కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం చూసీచూడనట్లుగా వ్యవహారిస్తోంది. కేవలం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పని చేస్తున్న కార్మికులకే వేతనాల పెంపును ప్రభుత్వం వర్తింప చేసింది. మిగిలిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పెంపుపై ప్రభుత్వం మౌన దాల్చింది. ప్రభుత్వ వివక్షా పూరిత వైఖరిపై కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులు మండిపడుతున్నారు. తమకు వేతనాలు పెంచే వరకు సమ్మె నుంచి వెనక్కి తగ్గబోమంటూ సమ్మెను కొనసాగిస్తున్నారు. సమ్మె కారణంగా ఇప్పటికే వరంగల్ నగరంతోపాటు మిగిలిన మున్సిపాలిటీలు అపరిశుభ్రంగా మారాయి. ఫాగింగ్, గ్యాంగ్ వర్క్‌లు నిలిచిపోవడంతో దోమలు విజృంభిస్తున్నాయి.
 

నేటి నుంచి ఆమరణ దీక్షలు
జిల్లాలోని మున్సిపాలిటీలు, నగరపంచాయతీలతో పోల్చితే గ్రేటర్ వరంగల్ పరిధిలో సమ్మె తీవ్రత కొనసాగుతూనే ఉంది. సమ్మెను నీరుగార్చే లక్ష్యంతో కార్పొరేషన్ అధికార యంత్రాంగం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించింది. చెత్త ఎత్తేందుకు 148 మంది దినసరి కూలీలను పనిలోకి తీసుకుంది. దానితోపాటే సమ్మెలో పాల్గొంటున్న 42 మంది కార్మికులపై వేటు వేశారు.

దానితో క్రమంగా విధుల్లో చేరుతున్న కార్మికుల సంఖ్య పెరుగుతోంది. అరుునప్పటికీ వరంగల్ కార్పొరేషన్ పరిధిలో 318 మంది కార్మికులు  ఇప్పటికీ సమ్మెలో పాల్గొంటున్నా రు. క్రమంగా సమ్మెలో పాల్గొంటున్న కార్మికుల సం ఖ్య తగ్గుతుండటంతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే లక్ష్యంతో నేటి నుంచి ఆమరణ దీక్షకు కార్మికులు సి ద్ధమవుతున్నారు. 2015 ఆగస్టు 6 ఉదయం 10:00 గంటల నుంచి గ్రేటర్ కార్పొరేషన్  కార్యాలయం ఎదుట ఆమరణ దీక్ష మొదలవనుంది. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చే వరకు పోరాటం నుంచి వెనక్కి తగ్గేది లేదంటున్నారు కార్మికులు.
 
జీతాలు ఇవ్వని బల్దియా
వరంగల్ కార్పొరేషన్ పరిధిలో పని చేస్తున్న కార్మికులకు ప్రతీనెల 25 నుంచి 25 వరకు ఉన్న పని దినాలను లెక్కించి తొలివారంలో వేతనం చెల్లిస్తారు. జు లై ఆరు నుంచి సమ్మె కొనసాగుతోంది. దానితో జు న్‌లో ఆరు, జులైలో ఐదు రోజులు కలిపి మొత్తం ప దకొండు రోజుల వేతనాన్ని కార్పొరేషన్ నుంచి కా ర్మికులకు చెల్లించాల్సి ఉంది. ఆగస్టు 1వ తేదీన కార్మికులకు బల్దియా వేతనాలు చెల్లించింది. అయితే కా ర్మికులందరికీ వేతనం ఇవ్వలేదు.

ప్రస్తుతం బల్దియా పరిధిలో మొత్తం 2,983 మంది కార్మికులు ఉండగా కార్పొరేషన్ అధికారుల సూచన మేరకు వీరిలో 1,453 మంది కార్మికులు జులై 25 నుంచి విధుల్లోకి వస్తున్నారు. కేవలం తమ విజ్ఞప్తిని మన్నించిన 1,45 3 మంది కార్మికులకే 11 రోజుల వేతనాన్ని బల్దియా చెల్లించింది. మిగిలిన కార్మికులకు అసలు వేతనాలు చెల్లించలేదు. వేతనం పొందిన 1,453 మంది కార్మికులకు సైతం అన్ని మినహాయింపులు పోను సగటు న ఒక్కో కార్మికునికి రూ 1100 జీతమే చేతికి అం దింది.  చాలీచాలనీ వేతనంతో కాంట్రాక్టు కార్మికు లు తాము ఇబ్బంది పడుతోంటే, కార్పోరేషన్ అధికార యంత్రాంగం  అభద్రత వాతవరణం కల్పిస్తోం దంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement