నేటి నుంచి ‘ఇంటింటికీ యోగా’ | From today 'house to house yoga' programme | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ‘ఇంటింటికీ యోగా’

Apr 24 2016 1:40 AM | Updated on May 29 2019 2:59 PM

సింగరేణి యూజమాన్యం కార్మిక సంక్షేమానికి చేపట్టిన ‘మీకోసం -మీ ఆరోగ్యం కోసం’లో భాగంగా ఆదివారం ...

11 ఏరియాల్లో 30వ తేదీ వరకు
బెంగళూరు నుంచి యోగాచార్యుల రాక
ఉదయం, సాయంత్రం శిక్షణ

 
కొత్తగూడెం(ఖమ్మం) : సింగరేణి యూజమాన్యం కార్మిక సంక్షేమానికి చేపట్టిన ‘మీకోసం -మీ ఆరోగ్యం కోసం’లో భాగంగా ఆదివారం నుంచి ఈనెల 30 వరకు కార్మికవాడల్లో ‘ఇంటింటికీ యోగా’ కార్యక్రమం నిర్వహిస్తోం ది. కంపెనీ వ్యాప్తంగా 11 ఏరియూల్లో వారం రోజుల పాటు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో కార్మికులు, వారి కుటుంబ సభ్యుల కు యోగా శిక్షణ ఉంటుంది. బెంగళూరుకు చెందిన శ్రీవివేకానంద యోగా యూనివర్సిటీ యోగాచార్యులు, పతంజలి యోగా సమితి, అరుణ యోగా సంస్థలకు చెందినవారు శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం నాలుగు రోజు లుగా సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిం చారు. అధికారులు, సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేయడం, మైకు ద్వారా ప్రచారం చేయడంతోపాటు గనుల వద్ద  సమావేశాలు నిర్వహించారు.


 కొత్తగూడెంలో..
కొత్తగూడెం కార్పొరేట్ పరిధిలోని బాబుక్యాం పు పార్కులో ఉదయం 5.30 నుంచి సాయంత్రం 7 గంటల వరకు, సాయంత్రం బస్టాండ్ వద్దగల చిల్డ్రన్స్‌పార్కు వద్ద 6 నుంచి 7 గంట ల వరకు, ఏరియా పరిధిలోని ప్రగతివనం పా ర్కులో శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement