నలుగురు నకిలీ మావోయిస్టుల అరెస్ట్ | four duplicate maoists arrested in adilabad district | Sakshi
Sakshi News home page

నలుగురు నకిలీ మావోయిస్టుల అరెస్ట్

Mar 27 2016 4:52 PM | Updated on Aug 20 2018 4:44 PM

ఆదిలాబాద్ జిల్లాలో పోలీసులు నకిలీ మావోయిస్టుల ఆటకట్టించారు. మంచిర్యాల పట్టణంలో మహిళ సహా నలుగురిని ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మంచిర్యాల : ఆదిలాబాద్ జిల్లాలో పోలీసులు నకిలీ మావోయిస్టుల ఆటకట్టించారు. మంచిర్యాల పట్టణంలో మహిళ సహా నలుగురిని ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలో పలువురిని బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తుంది. పోలీసులకు అందిన పక్కా సమాచారంతో నకిలీ మావోయిస్టులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 4 తుపాకులు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement