breaking news
duplicate maoists
-
నకిలీ మావోయిస్టులు అరెస్ట్
ఏటూరునాగారం: నలుగురు నకిలీ మవోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. జయశంకర్ భూపాలపల్లి జల్లా ఏటూరునాగారం మండలం బూటారం వద్ద శనివారం వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు నలుగురు నకిలీ మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 29 వేల నగదును స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు. ఈ మేరకు ఏఎస్పీ విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు. -
నలుగురు నకిలీ మావోయిస్టుల అరెస్ట్
మంచిర్యాల : ఆదిలాబాద్ జిల్లాలో పోలీసులు నకిలీ మావోయిస్టుల ఆటకట్టించారు. మంచిర్యాల పట్టణంలో మహిళ సహా నలుగురిని ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలో పలువురిని బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తుంది. పోలీసులకు అందిన పక్కా సమాచారంతో నకిలీ మావోయిస్టులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 4 తుపాకులు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.