ఆర్డీవో కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం

Former Tries To Commit Suicide At RDO Office At Chevella - Sakshi

సాక్షి, రంగారెడ్డి : 40 ఏళ్లుగా సాగు చేస్తున్న భూమిని కబ్జా చేశారనే ఆవేదనతో.. జంగయ్య అనే రైతు మంగళవారం చేవెళ్ల ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాలు.. పాల్గుట్ట గ్రామనికి చెందిన రైతు జంగయ్య తన భూమిని కబ్జా చేశారని ఆరోపించారు. అంతేకాక తనపై అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్నారని తెలిపారు. భూమి దగ్గరకు వెళ్లకుండా ఎస్‌ఐ రేణుకా రెడ్డి తనను బెదిరిస్తుందని ఆరోపించారు. ఈ విషయం గురించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికి ఎలాంటి ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 40 ఏళ్లుగా సాగు చేస్తున్న భూమి తనకు దక్కదనే భయంతో ఆర్డీవో కార్యాలయం ఎదుట పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు జంగయ్య.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top