మాజీ మంత్రి కుమారుడికి బెదిరింపులు..?  | Former Minister Threatens To Son In Warangal | Sakshi
Sakshi News home page

మాజీ మంత్రి కుమారుడికి బెదిరింపులు..? 

Mar 17 2019 4:49 PM | Updated on Mar 17 2019 5:03 PM

Former Minister Threatens To Son In Warangal - Sakshi

సాక్షి, వరంగల్‌ రూరల్‌: ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కుమారుడిని పలువురు శనివారం ఫోన్లో బెదిరింపులకు పాల్పడినట్లు తెలిసింది. ఓ హత్యతో సంబంధం ఉందని దానికి సంబంధించిన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని, బయటకు తెలియకుండా ఉండాలంటే తమకు రూ 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారని సమాచారం. దీనిపై పోలీసులకు మాజీ మంత్రి తనయుడు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో వరంగల్‌ రూరల్‌ జిల్లాకు చెందిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.   

Advertisement
 
Advertisement
Advertisement