అకాల వర్షంతో పంటను దెబ్బతీయడంతో మనస్తాపానికి లోనైన ఓ యువరైతు పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అకాల వర్షంతో పంటను దెబ్బతీయడంతో మనస్తాపానికి లోనైన ఓ యువరైతు పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కరీంనగర్ జిల్లా జగిత్యాలలో మంగళవారం ఈ ఘటన జరిగింది.
ఆరె రవి అనే యువరైతు తనకున్న రెండెకరాల వరిపంట సాగు చేస్తున్నాడు. రెండు రోజులుగు కురుస్తున్న ఆకాల వర్షాలతో వరిపంట పూర్తిగా నెలకొరిగింది. గత ఏడాది గల్ఫ్ కు వలస వెళ్లడంకోసం చేసిన లక్ష రూపాయలతోపాటు పంట ఖర్చులకు కొత్త అప్పులు చేశాడు. అప్పులు తీరే మార్గం లేకపోవడంతో మనస్తాపం చెంది పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.