‘మేరీ గోల్డ్‌’ కేజీ రూ.800 

Flower Prices Increased in Khammam During Diwali - Sakshi

కొత్తగూడెంటౌన్‌: దీపావళి పండుగ సందర్భంగా ప్రజలు లక్ష్మీపూజ చేస్తారు. దీంతో పూల ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. కిలో మేరీ గోల్డ్‌ చామంతి ఏకంగా రూ.800 ధర పలకడంతో అవాక్కవుతున్నారు. 
వారం కిందట వంగ రంగు చామంతి కిలో రూ.400 ఉంటే ఇప్పుడు రూ.650 పలుకుతోంది. కొత్తగూడెంలోని సూపర్‌బజార్, గణేశ్‌టెంపుల్‌ ఏరియా, రామవరం, త్రీటౌన్‌ సెంటర్, విద్యానగర్‌కాలనీ, పాలకేంద్రం, రుద్రంపూర్, గౌతంపూర్, ధన్‌బాద్‌లతోపాటు పలు ప్రాంతాల్లో పూల కొనుగోళ్లు పెరగడంతో మార్కెట్లన్నీ సందడిగా మారాయి.  

కూసుమంచి మండలంలో..  
కూసుమంచి: మండలంలోని చేగొమ్మ క్రాస్‌రోడ్‌ లో బంతిపూల తోటలను పలువురు గిరిజనులు సాగుచేశారు. వారు అక్కడే పూలను విక్రయిస్తున్నారు. కిలో పూలు రూ.60 నుంచి రూ.70 వరకు అమ్ముతున్నారు. మూడు రోజుల కిందట రూ.40 వరకే పూలను అమ్మగా పండుగ సందర్భంగా ఆదాయం పెరిగింది. ఖమ్మం–సూర్యాపేట రా్రïÙ్టయ రహదారి పక్కన ఈ తోటలు ఉండటంతో వచ్చిపోయే వాహనదారులు పూలను కొంటున్నారు. 

వైరాలో..  
వైరా: రెండు రోజుల కిందట కిలో రూ.35 నుంచి రూ.40 ఉన్న బంతి పూల ధర ఒక్కసారిగా రూ.80 నుంచి రూ.100కు పెరిగింది. వైరా–ఖమ్మం వెళ్లే ప్రధాన రహదారిపై పల్లిపాడు సమీపంలో బంతిపూల సాగు సుమారు 20 ఎకరాల్లో ఉంది. ఇక్కడి నుంచి విజయవాడ, హైదరాబాద్‌ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. హైవే మీద ఉండటంతో పూలను మార్కెట్‌కు తీసుకుపోయే ఖర్చు కూడా తగ్గింది. వాహనదారులు వాహనాలు నిలిపి విరివిగా బంతిపూలు కొనుగోలు చేస్తుండటంతో డిమాండ్‌ ఉంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top