వ్యవసాయానికి, భక్తికి ప్రాధాన్యత ఇచ్చి సుదీర్ఘపాలన సాగించిన కాకతీయుల రాజధాని కేంద్రం ఖిలావరంగల్‌లో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుంది
-

-
ఖిలా వరంగల్‌లో పంద్రాగస్టు వేడుకలు
-
సర్కారు గోల్కొండ స్ఫూరితో నిర్ణయం
సాక్షి ప్రతినిధి, వరంగల్: వ్యవసాయానికి, భక్తికి ప్రాధాన్యత ఇచ్చి సుదీర్ఘపాలన సాగించిన కాకతీయుల రాజధాని కేంద్రం ఖిలావరంగల్‌లో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుంది. తెలంగాణ రాష్ర్టంలో తొలిసారిగా జరుగుతున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను రాష్ట్ర స్థాయి లో గోల్కొండ కోట ఆవరణలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే స్ఫూర్తి తో గత వైభవాన్ని గుర్తు చేసేలా వరంగల్‌లోనూ కాకతీయ కోటలో ఆగస్టు 15 వేడుకలకు నిర్వహించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది.
కోట ప్రాంతం ఆవరణలోని ఖుష్‌మహల్ పక్క న ఖాళీ ప్రాంతంలో ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ మేరకు ఖిలావరంగల్ ప్రాంతం స్వాతంత్య్ర వేడుకలకు ముస్తాబవుతోంది. కాకతీయుల్లో ముఖ్యురాలైన రాణిరుద్రమదేవి హయాం(1261)లో ఈ కోట నిర్మాణం పూర్తి అయ్యింది. కాకతీయుల శకం ముగిసిన తర్వాత నిజాం నవాబుల పరిపాలనలో షితాబ్‌ఖాన్ సైన్యాధికారిగా ఉన్నప్పుడు ఖిలావరంగల్‌లో ఖుష్‌మహల్ ను నిర్మించారు. కీర్తి తోరణాలు, ఖుష్‌మహల్ మధ్య ఉన్న ఖాళీ ప్రదేశంలో స్వాతంత్య్ర వేడుకలు జరగనున్నాయి.