వైద్యుల నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. చికిత్స నిమిత్తం ఓ ఆస్పత్రిలో చేరిన ఐదేళ్ల బాలుడు మృతిచెందాడు.
రంగారెడ్డి: వైద్యుల నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. చికిత్స నిమిత్తం ఓ ఆస్పత్రిలో చేరిన ఐదేళ్ల బాలుడు మృతిచెందాడు. ఆస్పత్రి వైద్యులు చికిత్స అందించిన అనంతరం వైద్యం వికటించడంతో ఆ బాలుడు మృతిచెందినట్టు తెలిసింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో గురువారం చోటుచేసుకుంది. బాలుడి మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు ఆరోపిస్తున్నారు. అందుకు నిరసనగా వారు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.