ఇంద్రవెల్లి సబ్ స్టేషన్లో అగ్నిప్రమాదం | Fire accident occurs in Indravelli substation | Sakshi
Sakshi News home page

ఇంద్రవెల్లి సబ్ స్టేషన్లో అగ్నిప్రమాదం

Apr 8 2014 8:13 AM | Updated on Sep 5 2018 9:45 PM

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి సబ్స్టేషన్లోని మంగళవారం అగ్నిప్రమాదం సంభవించింది.

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి సబ్స్టేషన్లోని మంగళవారం అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా అగ్ని కీలలు ఎగసిపడుతున్నాయి. దాంతో సబ్ స్టేషన్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలార్పేందుకు యత్నిస్తున్నారు.

 

ఆ ప్రమాదంలో సబ్స్టేషన్లోని ట్రాన్స్ఫార్మర్లన్ని కాలి బుడిదయ్యాయి. ఇంద్రవెల్లి సబ్ స్టేషన్లో అగ్ని ప్రమాదం సంభవించడంతో ఉట్నూర్, ఇంద్రవెల్లి, సిర్పూర్, జైనూర్ తదితర మండలాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

Advertisement
 
Advertisement
Advertisement