జగమంత కుటుంబం మనది! | Father And Son Continental travel On Bikes | Sakshi
Sakshi News home page

జగమంత కుటుంబం మనది!

Apr 20 2018 8:08 AM | Updated on Sep 4 2018 5:44 PM

Father And Son Continental travel On Bikes - Sakshi

అమీర్‌పేట: ప్రపంచ శాంతి, జగమంతా వసుధైక కుటుంబం అనే నినాదంతో తండ్రీకొడుకు బైక్‌ యాత్ర చేపట్టనున్నారు. నగరంలోని పాథ్‌కేర్‌ ల్యాబ్స్‌ ఎండీ డాక్టర్‌ జి.వి.ప్రసాద్, ఆయన చిన్నకుమారుడు డాక్టర్‌ రక్షిత్‌లు ద్విచక్ర వాహనంపై ఖండాంతర ప్రయాణం చేయనున్నారు. అమీర్‌పేట మ్యారీగోల్డ్‌ హోటల్‌లో యాత్రకు సంబంధించిన వివరాలను గురువారం వారు వివరించారు. ఈ నెల 24న బైక్‌ యాత్ర ప్రారంభమవుతుందన్నారు.

మొత్తం 17 వేల కి.మీ, 17 దేశాల్లో 55 రోజుల పాటు ప్రయాణించి జూన్‌ 24 లండన్‌ చేరుకుంటామన్నారు. బీఎండబ్ల్యూ జీఎస్‌–12 బైక్‌లపై సాహస యాత్ర చేయనున్నామన్నారు. గతంలో అమెరికాలో 17వేల కి.మీ బైక్‌ యాత్ర, నగరం నుంచి భూటాన్‌ వరకు 12 వేల కి.మీ యాత్ర చేసిన అనుభవం తనకు ఉందని డాక్టర్‌ జి.వి.ప్రసాద్‌ తెలిపారు. ప్రస్తుతం ప్రపంచ శాంతి, ప్రపంచమంతా వసుధైక కుటుంబం అనే నినాదంతో ఖండాంతర యాత్ర చేయనున్నామన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement