ఖమ్మం జిల్లా కూసుమంచిలోని ఎస్ బీహెచ్ బ్యాంకు ముందు బుధవారం రైతులు ధర్నాకు దిగారు.
ఖమ్మం : ఖమ్మం జిల్లా కూసుమంచిలోని ఎస్బీహెచ్ బ్యాంకు ముందు బుధవారం రైతులు ధర్నాకు దిగారు. రుణాలను ఏకమొత్తంలో మాఫీ చేయాలని, పంటల సాగు కోసం తక్షణం రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మాత్రమే తాము పని చేయాల్సి ఉంటుందని, ప్రభుత్వం ఇస్తే మాఫీ చేయడానికి తమకు అభ్యంతరం ఏమీలేదని బ్యాంకు అధికారులు రైతులకు తెలిపారు.