సాగునీటి కోసం రైతుల ధర్నా | farmers dharana at ramannapet | Sakshi
Sakshi News home page

సాగునీటి కోసం రైతుల ధర్నా

Aug 17 2015 1:00 PM | Updated on Oct 1 2018 2:00 PM

నల్గొండ జిల్లాలోని రామన్నపేట, నార్కెట్‌పల్లి, చిట్యాల గ్రామాలకు సాగునీరు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు సోమవారం ఉదయం రామన్నపేటలో ధర్నాచేశారు.

రామన్నపేట : నల్గొండ జిల్లాలోని రామన్నపేట, నార్కెట్‌పల్లి, చిట్యాల గ్రామాలకు సాగునీరు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు సోమవారం ఉదయం రామన్నపేటలో ధర్నాచేశారు. మూసీ నది నుంచి ధర్మారెడ్డి కాలువకు సాగునీరు విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్సీ లింగయ్య ఆధ్వర్యంలో 500 మంది రైతులు ఆందోళన నిర్వహించారు. సాగునీరులేక తమ పొలాలు ఎండిపోతున్నాయని, తెలంగాణ సర్కార్ స్పందించి ధర్మారెడ్డి కాలువకు నీరు సరఫరా చేయాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement