విద్యుత్ కోసం రైతుల కన్నెర్ర | farmers attacked on substation in kotta lingala | Sakshi
Sakshi News home page

విద్యుత్ కోసం రైతుల కన్నెర్ర

Sep 30 2014 1:59 AM | Updated on Sep 18 2018 8:38 PM

విద్యుత్ సరఫరాపై రైతుల్లో ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

కొత్తలింగాల(కామేపల్లి) : విద్యుత్ సరఫరాపై రైతుల్లో ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కొత్తలింగాల సబ్‌స్టేషన్ ఫర్నిచర్‌ను జాస్తిపల్లికి చెందిన రైతులు సోమవారం రాత్రి ధ్వంసం చేశారు.  అనంతరం రాస్తారోకో చేశారు. తమ పంటలకు రాత్రి 10 నుంచి 12 గంటల వరకు విద్యుత్‌ను సరఫరా చేయాల్సి ఉండగా కోతలు విధిస్తున్నారని మండిపడ్డారు.

దీంతో  తమ పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సిబ్బంది దృష్టికి తీసుకొచ్చినా పట్టించుకోవడం లేదన్నారు. పంటలు ఎండిపోయి నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. రైతులు ఆందోళకు దిగినట్లు తెలుసుకున్న  పోలీసులు అక్కడిక చేరుకున్నారు. రైతులకు నచ్చజెప్పి రాస్తారోకోను విరమింపజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement