ట్రాన్స్‌ఫార్మర్ పై ఫీజ్ సరిచేయడానికి యత్నించిన రైతు విద్యుధ్ఘాతానికి గురై మృతిచెందాడు.
ట్రాన్స్‌ఫార్మర్ పై ఫీజ్ సరిచేయడానికి యత్నించిన రైతు విద్యుధ్ఘాతానికి గురై మృతిచెందాడు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ మండలం ఊట్కూర్ చిన్న జాత్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు బావి వద్ద ట్రాన్స్‌ఫార్మర్‌పై ఫీజు సరిచేస్తుండగా.. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగలడంతో.. అక్కడికక్కడే మృతిచెందాడు. ఇది గుర్తించిన స్థానికులు మృతదేహాన్ని కిందకు దించి పోలీసులకు సమాచారం అందించారు.