విద్యుదాఘాతంతో రైతు మృతి | farmer died due to current shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో రైతు మృతి

Jan 7 2016 1:32 PM | Updated on Oct 1 2018 4:01 PM

మోటర్ పైపులు బోరుబావిలోకి దించుతున్న సమయంలో విద్యుత్‌తీగలు తగిలి ఓ రైతు మృత్యు వాత పడ్డాడు.

భువనగిరి: మోటర్ పైపులు బోరుబావిలోకి దించుతున్న సమయంలో విద్యుత్‌తీగలు తగిలి ఓ రైతు మృత్యు వాత పడ్డాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా భువనగిరి మండలం తుక్కపురం గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బాల్‌రెడ్డి(38) సాగు కోసం గత నాలుగేళ్లలో పది బోర్లు వేశాడు. అయినా చుక్క నీరు పడలేదు. తాజాగా వేసిన బోరులో నీరు పడటంతో.. మోటర్ బిగించడానికి ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తు పైపులు పైన ఉన్న హైటెన్షన్ తీగలకు తాకడంతో విద్యుధ్ఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement