మనస్తాపంతో సెల్‌టవర్ ఎక్కిన రైతు | Farmer climbs cell tower | Sakshi
Sakshi News home page

మనస్తాపంతో సెల్‌టవర్ ఎక్కిన రైతు

Oct 20 2015 6:00 PM | Updated on Oct 1 2018 2:44 PM

విద్యుత్ కష్టాలతో మనస్తాపం చెందిన ఓ రైతు రంగారెడ్డి జిల్లా పెద్దేముల్‌లో సెల్ టవర్ ఎక్కాడు.

పెద్దేముల్ (రంగారెడ్డి జిల్లా) : విద్యుత్ కష్టాలతో మనస్తాపం చెందిన ఓ రైతు రంగారెడ్డి జిల్లా పెద్దేముల్‌లో సెల్ టవర్ ఎక్కాడు. రైతు జాగరి నర్సప్ప ఎనిమిది ఎకరాల్లో అరటి, ఒక ఎకరంలో ఉల్లి పంట వేశాడు. అయితే, గత 15 రోజులుగా తీవ్ర విద్యుత్ అంతరాయాలతో పంటలకు నీరు పెట్టలేని పరిస్థితి నెలకొనడంతో మనస్తాపం చెందాడు.

ఈ నేపథ్యంలో మంగళవారం పెద్దేముల్‌లో సెల్‌టవర్ ఎక్కిన అతడు న్యాయం చేయాలని, లేకుంటే దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగాడు. స్థానికులు అతనికి ఏదోలా నచ్చజెప్పి కిందకు వచ్చేలా చేయడంతో ఉత్కంఠకు తెరపడింది.

Advertisement
 
Advertisement
Advertisement