డబ్బులడిగితే ఫిర్యాదు చేయండి

Eye Tests For Everyone  - Sakshi

ఎవరికీ ఎక్కడా డబ్బులు చెల్లించవద్దు

జిల్లాలో ఇప్పటి వరకు 354మందికి కంటి అద్దాల పంపిణీ

కౌడిపల్లి, నర్సాపూర్‌ కంటి వెలుగు వైద్యశిబిరాల సందర్శన

కౌడిపల్లి(నర్సాపూర్‌) : కంటి వెలుగు వైద్యశిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎవరి ఎక్కడ డబ్బులు చెల్లించవద్దని డీఎంహెచ్‌ఓ వెంకటేశ్వరరావ్‌ తెలిపారు. శుక్రవారం కౌడిపల్లి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో కొనసాగుతున్న కంటి వెలుగు వైద్యశిబిరాన్ని తనిఖీ నిర్వహించారు. రోగులకు వైద్యసేవలను గురించి అడిగితెలుసుకున్నారు. వైద్యచికిత్సలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 20 బృందాలు కంటి వెలుగు వైద్యశిబిరంలో చికిత్సలు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 354 మందికి కంటి అద్దాలు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. మరో 750 మందికి వివిధ రకాల కంటి అద్దాలు అవసరంగా గుర్తించినట్లు తెలిపారు. వీరికి మూడు వారాలలో కంటి అద్దాలు పంపిణీ చేస్తామన్నారు. 90 మందికి కంటి శుక్లాలు ఇతర ఆపరేషన్లు అవసరంగా గుర్తించామన్నారు. వీరికి 114 కార్పోరేట్‌ ఆసుపత్రులలో వారి కోరిక మేరకు ఆపరేషన్లు నిర్వహిస్తామని పేర్కొన్నారు. 

డబ్బులడిగితే ఫిర్యాదు చేయాలి.. 

గ్రామంలో కొనసాగిని వైద్యశిబిరం పూర్తయిన తరువాత ఆపరేషన్లు అవరంగా గుర్తించిన వారిని వైద్యుల సహాయంతో వాహనంలో పంపించి ఆపరేషన్లు చేయిస్తామన్నారు. ఎక్కడ ఎవరకి ఒక్కరూపాయి చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఎవరైనా డబ్బులు అడిగితే ఫిర్యాదు చేయాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలుకు కంటి వెలుగు పథకంద్వార పూర్తిగా ఉచితంగా వైద్యచికిత్సలు చేయిస్తుందని తెలిపారు. వర్షం కారణంగా కొంత నెమ్మదిగా కొనసాగుతుందన్నారు. రోజుకు 250 మందికి వైద్యం చేయాల్సి ఉండగా కొంత తక్కువగా ఉందన్నారు. ప్రజలు సహకరించి వైద్యశిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్‌ వెంకటస్వామి, డాక్టర్‌ శోభన సిబ్బంది పాల్గొన్నారు.  

నర్సాపూర్‌: ప్రభుత్వం ప్రతాష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమంలో ఏర్పాటు చేసిన  కంటి పరీక్ష కేంద్రాలకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని జిల్లా డీఎంఅండ్‌ హెచ్‌ఓ డాక్టర్‌ వెంకటేశ్వరరావు సూచించారు.  శుక్రవారం ఆయన నర్సాపూర్‌లోని పురపాలక కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కేంద్రాన్ని పరిశీలించారు. ఏర్పాట్లపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన çప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని అన్నారు. కంటి పరీక్షలు చేసి పలు సూచనలు చేశారు. ఆయన వెంట డిప్యూటీ  డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్‌ విజయ నిర్మల, డీఐఓ డాక్టర్‌ నవీన్‌ తదితరులు ఉన్నారు. నర్సాపూర్‌ కేంద్రంలో చేపడుతున్న పరీక్షల వివరాలను డాక్టర్‌ పావని ఆయనకు వివరించారు. 

కొల్చారంలో.. 

కొల్చారం(నర్సాపూర్‌): కంటి సమస్యలతో బాధపడుతున్న వారు ప్రభుత్వం ద్వారా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం కొల్చారం మండలం తుమ్మలపల్లిలో చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆయన తనిఖీ చేశారు. దేశంలో ఎక్కువగా ప్రజలు కంటి సమస్యలతో బాధపడటం మారిన ఆహార అలవాట్లు కొంత వరకు కారణమన్నారు. చిన్న వయస్సులోనే కంటి సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువ అవుతుందన్నారు. ప్రభుత్వం తీసుకున్న కంటి వెలుగు పథకం ద్వారా గ్రామీణస్థాయిలో వైద్య శిబిరాలలను ఏర్పాటు చేయడం, ఉచితంగా కళ్లద్దాలు అందించడం ప్రతి ఒక్కరు హర్షించదగ్గ విషయమన్నారు. ఈ సందర్భంగా కంటి అద్దాలు అవసరమైన వారికి కళ్లద్దాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కొల్చారం వైద్యాధికారి రమేష్‌తోపాటు సిబ్బంది పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top