
మాజీ మంత్రి సమ్మయ్య కన్నుమూత
అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బొచ్చు సమ్మయ్య (71) సోమవారం మృతి చెందారు.
పరకాల: అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బొచ్చు సమ్మయ్య (71) సోమవారం మృతి చెందారు. హైదరాబాద్‌లోని ఆయన ఇంట్లో కాలు జారిపడి తలకు తీవ్ర గాయం కావడంతో ఈ నెల 9న ఆయన్ను నిమ్స్‌కు తరలించారు. తలలో రక్తం గడ్డకట్టడంతో నిమ్స్‌లో వైద్య నిపుణుల బృందం చికిత్స అందించింది.
వరంగల్ జిల్లా పరకాలకు చెందిన సమ్మయ్య.. 1979లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా.. చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు. పీవీ నరసింహారావు హయంలో జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యునిగా సేవలందించారు. మంగళవారం పరకాలలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.