గంజాయి సేవిస్తున్న 9 మంది ఇంజనీరింగ్ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల అదుపులో ఇంజనీరింగ్ విద్యార్థులు
Jul 30 2017 8:23 PM | Updated on Aug 21 2018 6:00 PM
సూర్యాపేట: గంజాయి సేవిస్తున్న 9 మంది ఇంజనీరింగ్ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ శ్రీరంగాపురంలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు గంజాయి సేవిస్తుండగా గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. తల్లిదండ్రుల సమక్షంలో విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి వదిలి పెడతామన్నారు. వారికి గంజాయి సప్లై చేస్తున్న వారిని అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.
Advertisement


