దీపారాధనతో ముగిసిన ఉర్సు | end of the urs celebrations | Sakshi
Sakshi News home page

దీపారాధనతో ముగిసిన ఉర్సు

Mar 30 2014 1:10 AM | Updated on Aug 24 2018 6:44 PM

అర్వపల్లిలోని హజ్రత్ ఖాజా నసీరుద్దీన్ బాబా దర్గా ఉర్సు ఉత్సవాలు శనివారం ముగిశాయి.

 అర్వపల్లి, న్యూస్‌లైన్ అర్వపల్లిలోని హజ్రత్ ఖాజా నసీరుద్దీన్ బాబా దర్గా ఉర్సు ఉత్సవాలు శనివారం ముగిశాయి. శనివారం దర్గాలో దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉత్సవాలకు హాజరైన భక్తులు కూడా దీపాలు వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌కు చెందిన డబుల్ పార్టీ నిర్వహించిన ఖావాలి ఆకట్టుకుంది.

 

అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తుంగతుర్తి సీఐ కె. పార్ధసారథి, అర్వపల్లి ఎస్‌ఐ కె.కొండల్‌రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే అర్వపల్లి పీహెచ్‌సీ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్గా చైర్మన్ సాయిని ఉమ్మయ్య, ముజావరి నసీరుద్దీన్, సభ్యులు మల్లేష్, హబీబ్, శ్రీను, జహంగీర్, సత్తయ్య, ఖాజాపాష, గోరేబాయి, మున్నా, రవూఫ్, అఖీల్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement