ఎన్నికల ఖర్చులు అభ్యర్థుల ఖాతాలో జమ చేస్తాం

Election Expenses Will Be Credited To The Candidates Account - Sakshi

కలెక్టర్‌ అమయ్‌కుమార్‌

హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఖర్చుల వివరాలు నేటి నుంచి వారి ఖాతాల్లో జమ చేస్తామని కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ తెలిపారు. సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎవరైనా ప్రలోభాలకు గురిచేస్తే టోల్‌ఫ్రీ నంబర్‌ 18004252838, 1950కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. సీ–విజిల్‌ యాప్‌ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.  
 
సాక్షి, హుజూర్‌నగర్‌: హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థుల ఖర్చుల వివరాలు నేటి నుంచి వారి ఖాతాలలో జమ చేస్తామని కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ అన్నారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు ప్రతి రోజూ జరిగిన ర్యాలీలను వీడియో తీయడం జరిగిందని తెలిపారు.  జిల్లాలో మొత్తం 14 ఫ్లయింగ్‌స్క్వాడ్‌ టీమ్స్, 14 స్టాటిక్‌ సర్వే చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామని తెలిపారు. హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో 2 వీడియో సర్వేలైన్‌ టీమ్‌లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు రూ.46 లక్షల 75 వేలను సీజ్‌ చేసినట్లు తెలిపారు. మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌లో భాగంగా ఎన్నికల సందర్భంగా టోల్‌ ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎవరైనా ప్రలోభాలకు గురిచేస్తే టోల్‌ఫ్రీ నంబర్‌ 18004252838, 1950కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. సి–విజిల్‌ యాప్‌ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.  24 గంటల పాటు జిల్లా కలెక్టరేట్, హుజూర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన టీంలు ఫిర్యాదు సెంటర్లలో పనిచేస్తున్నారని తెలిపారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top