అమ్మానాన్నలకు ఆసరాగా ఉంటాం | Sakshi
Sakshi News home page

అమ్మానాన్నలకు ఆసరాగా ఉంటాం

Published Sat, Nov 4 2017 3:16 AM

elderly couple are grateful to the 'sakshi' article on them - Sakshi

మునుగోడు: తల్లిదండ్రులకు ఇక నుంచి ఎలాంటిలోటు రాకుండా చూసుకుంటామని నలుగురు కుమారులు అధికారుల ముందు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలోని బట్టకాల్వకు చెందిన నారగోలు ముత్యాలు, మంగమ్మ దంపతులను కుమారులు ఇంట్లో నుంచి గెంటివేసిన వైనంపై ‘సాక్షి’ మెయిన్‌లో శుక్ర వారం ‘‘కొడుకులా.. కర్కోటకులా’’ శీర్షికన ప్రచురితమైన కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. తహసీల్దార్‌ హెచ్‌.ప్రమీల ఉదయమే ఆ దంపతుల వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకున్నారు.

అనంతరం నలుగురు కుమా రులను కార్యాలయానికి పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. తల్లిదండ్రులను పోషించలేకుంటే వారి ఆస్తులను తిరిగి ఇచ్చేయాలని ఆదేశిం చారు. వారిని సక్రమంగా చూసుకుంటామని రాసి ఇవ్వాలని, లేనిపక్షంలో కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. దీంతో కుమారులు తమ తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటామని, తాము చేసింది తప్పేనని ఒప్పుకున్నారు.   వారి ని ఒక అద్దె ఇంట్లో ఉంచి సరిపడా సరుకులను అందిస్తామని, త్వరలో అందరం కలసి కొత్త ఇంటిని నిర్మించి ఇస్తామని రాసిచ్చారు. దీంతో ఆ వృద్ధ దంపతులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ‘సాక్షి’ పత్రికకు కృతజ్జతలు తెలిపారు.

Advertisement
Advertisement