విజయరామారావు కుమారుడి నివాసంలో ఈడీ సోదాలు | ED Raids On Vijaya Rama Rao Son Offices | Sakshi
Sakshi News home page

Oct 8 2018 11:42 PM | Updated on Oct 9 2018 10:57 AM

ED Raids On Vijaya Rama Rao Son Offices - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సీబీఐ మాజీ డైరెక్టర్‌ విజయరామారావు కుమారుడు శ్రీనివాస్‌ కార్యాలయాలు, ఇళ్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విభాగం సోమవారం సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌తోపాటు బెంగళూరులోనూ తనిఖీలు చేసింది. కర్ణాటకకు చెందిన ప్రముఖ బ్యాంకు నుంచి ఆయన రూ. 315 కోట్ల రుణం తీసుకుని చెల్లించలేదు. దీంతో ఆ బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు గతంలోనే శ్రీనివాస్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఉన్న ఆధారాల మేరకు ఈడీ అధికారులు సోమవారం హైదరాబాద్, బెంగళూరుల్లోని ఆయన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేసినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement