ఇక రెండు రాష్ట్రాల్లోనూ వైఎస్సార్ సీపీకి గుర్తింపు | EC recognises YSRCP as regional party in andhra and telangana | Sakshi
Sakshi News home page

ఇక రెండు రాష్ట్రాల్లోనూ వైఎస్సార్ సీపీకి గుర్తింపు

Jun 24 2014 10:53 PM | Updated on May 25 2018 9:17 PM

ఇక రెండు రాష్ట్రాల్లోనూ వైఎస్సార్ సీపీకి గుర్తింపు - Sakshi

ఇక రెండు రాష్ట్రాల్లోనూ వైఎస్సార్ సీపీకి గుర్తింపు

ఇక కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కూడా వైఎస్సార్ సీపీ గుర్తింపు లభించింది.

హైదరాబాద్: ఇక కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కూడా వైఎస్సార్ సీపీ గుర్తింపు లభించింది. ఈ మేరకు మంగళవారం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఈసీ లేఖ రాసింది.  ఉభయ రాష్ట్రాల్లోనూ వైఎస్సార్ సీపీకి సీలింగ్‌ ఫ్యాన్‌ గుర్తు కేటాయిస్తున్నట్లు పేర్కొంది. అంతకముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే.  ఇటీవల జరిగిన ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో వైఎస్సార్ సీపీ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.

 

దీంతో ఆ పార్టీ గుర్తుగా ఉన్న సీలింగ్ ఫ్యాన్‌ను ఇక  రెండు రాష్ట్ర్రాలో శాశ్వత ప్రాతిపదికన ఆ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులకే కేటాయించడం జరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement