breaking news
Navin Mittal
-
నవీన్ మిత్తల్ బదిలీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం భారీ సంఖ్యలో సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) నవీన్ మిత్తల్‌ను ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. ఆయనతో పాటు హైదరాబాద్, మల్కాజిగిరి సహా పలు జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లకు స్థాన చలనం కలిగించింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రస్తుత కార్యదర్శి బుద్దప్రకాశ్ను ఆ పోస్టు నుంచి తప్పించింది. కలెక్టర్ల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ మేరకు కొందరి బదిలీకి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అలాగే మిత్తల్‌ను దీర్ఘకాలం పాటు రెవెన్యూ శాఖలో కొనసాగించిన ప్రభుత్వం ఎట్టకేలకు ఆయన్ను బదిలీ చేసింది.గత ప్రభుత్వంలో కూడా కీలకంగా వ్యవహరించిన ఆయనపై..అధికారంలోకి రాకముందు విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ పార్టీ .. అధికారంలోకి వచి్చన తర్వాత కూడా అక్కడే కొనసాగించడం చర్చనీయాంశమయ్యింది. మరో సీనియర్ ఐఏఎస్ అధికారి, ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్ కూడా బదిలీ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆయన మొత్తం మూడుసార్లు బదిలీ కావడం గమనార్హం.ఇక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవిని ఆశించిన డాక్టర్ శశాంక్ గోయల్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా నియమితులయ్యారు. ఈ స్థానంలో ఉన్న గౌరవ్ ఉప్పల్‌ను కేంద్ర ప్రాజెక్టులు, కేంద్ర ప్రాయోజిత పథకాల సమన్వయ కార్యదర్శిగా సర్కారు నియమించింది. మొత్తం 36 మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ప్రసుత్తం పరిశ్రమల శాఖ డైరెక్టర్‌గా పనిచేస్తున్న గుర్రం మల్సూర్‌ను ముఖ్యమంత్రి ముఖ్య పౌరసంబంధాల అధికారిగా నియమించారు.బదిలీలు ఇలా.. 1. డాక్టర్ శశాంక్ గోయల్; ప్రస్తుతం: స్పెషల్ సీఎస్, తెలంగాణ భవన్ (ఢిల్లీ); బదిలీ: స్పెషల్ సీఎస్, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్.2. నవీన్ మిత్తల్; ప్రస్తుతం: ముఖ్య కార్యదర్శి రెవెన్యూ శాఖ, సీసీఎల్ఏ ; బదిలీ: ముఖ్య కార్యదర్శి, ఇంధన శాఖ3. ఎన్. శ్రీధర్; ప్రస్తుతం: ముఖ్య కార్యదర్శి, ఎస్సీ అభివృద్ధి శాఖ; బదిలీ: ముఖ్య కార్యదర్శి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి,ఆర్డబ్ల్యూఎస్, అదనంగా ముఖ్య కార్యదర్శి మైన్స్, జియాలజీ.4. డాక్టర్ జ్యోతి బుద్దప్రకాశ్; ప్రస్తుతం: కార్యదర్శి స్టాంప్స్, రిజి్రస్టేషన్స్, గృహనిర్మాణ శాఖ; బదిలీ: కార్యదర్శి ఎస్సీ అభివృద్ధి, అదనంగా ప్రణాళిక శాఖ, టీజీఆర్ఏసీ డీజీ.5. లోకేశ్‌కుమార్; ప్రస్తుతం: అదనపు సీఈవో; బదిలీ: పూర్తి అదనపు బాధ్యతలు కార్యదర్శి, రెవెన్యూ, సీసీఎల్ఏ.6.గౌరవ్ ఉప్పల్; ప్రస్తుతం: రెసిడెంట్ కమిషనర్ తెలంగాణ భవన్ ఢిల్లీ; బదిలీ: కార్యదర్శి సమన్వయం కేంద్ర ప్రాజెక్టులు, ప్రాయోజిత కార్యక్రమాలు.7. భారతీ లక్పతి నాయక్ ; ప్రస్తుతం: కార్యదర్శి, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్; బదిలీ: కార్యదర్శి, సమాచార కమిషన్.8. హరిచందన దాసరి; ప్రస్తుతం: కార్యదర్శి, రోడ్లు, భవనాలు; బదిలీ: కలెక్టర్, హైదరాబాద్.9. కిల్లు శివకుమార్‌నాయుడు; ప్రస్తుతం: అదనపు కమిషనర్ జీహెచ్ఎంసీ; బదిలీ: కమిషనర్, ఆర్ అండ్ ఆర్, భూ సేకరణ ఐ క్యాడ్.10. రాజీవ్‌గాంధీ హన్మంతు; ప్రస్తుతం: కలెక్టర్, నిజామాబాద్; బదిలీ: ప్రత్యేక కార్యదర్శి, స్టాంప్స్ అండ్ రిజి్రస్టేషన్స్, కమిషనర్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ అదనపు బాధ్యతలు.11. వినయ్ కృష్ణారెడ్డి; ప్రస్తుతం: కమిషనర్ ఆర్,ఆర్ అండ్ ఎల్ ఏ, ఐ క్యాడ్; బదిలీ: కలెక్టర్, నిజామాబాద్.12. జి.శ్రీజన ; ప్రస్తుతం: డైరెక్టర్, పీఆర్ అండ్ ఆర్డీ; బదిలీ: డైరెక్టర్ మహిళా శిశు సంక్షేమం(అదనపు బాధ్యతలు).13. శివశంకర్ లాహోటి; ప్రస్తుతం: వెయిటింగ్ ఫర్ పోస్టింగ్; బదిలీ: సంయుక్త కార్యదర్శి, వ్యవసాయం, సహకార శాఖ, సంయుక్త కార్యదర్శి డిజాస్టర్ మేనేజ్మెంట్ (అదనపు బాధ్యతలు)14. చిట్టెం లక్ష్మి; ప్రస్తుతం: వెయిటింగ్ ఫర్ పోస్టింగ్; బదిలీ: సంయుక్త కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ.15. కె.హైమావతి; ప్రస్తుతం: పీడీ ఎయిడ్స్ కంట్రోల్ సోసైటీ; బదిలీ: కలెక్టర్, సిద్దిపేట.16. వాసం వెంకటేశ్వర్లు; ప్రస్తుతం: డైరెక్టర్ యువజన సరీ్వసులు; బదిలీ:డైరెక్టర్, ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, డైరెక్టర్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్, కుటుంబ సంక్షేమం.17. వీపీ గౌతమ్ ; ప్రస్తుతం: ప్రత్యేక కార్యదర్శి, గృహ నిర్మాణం; బదిలీ: కార్యదర్శి, గృహ నిర్మాణ శాఖ (అదనపు బాధ్యతలు)18. గౌతం పొట్రూ; ప్రస్తుతం: కలెక్టర్, మల్కాజిగిరి–మేడ్చల్; బదిలీ: డైరెక్టర్ సింగరేణి పర్సనెల్ అండ్ అడ్మిని్రస్టేషన్.19.కె. నిఖిల; ప్రస్తుతం: సీఈవో, టీజీఐఆర్డీ; బదిలీ: డైరెక్టర్, మత్స్యశాఖ, సీఈవో (టీజీఐఆర్డీ అదనపు బాధ్యతలు)20.వల్లూరి క్రాంతి; ప్రస్తుతం: కలెక్టర్, సంగారెడ్డి; బదిలీ: మేనేజింగ్ డైరెక్టర్ , పర్యాటకాభివృద్ధి సంస్థ21.ఉదయ్‌కుమార్; బదిలీ: సీఈవో, ఆరోగ్యశ్రీ ట్రస్ట్, ప్రత్యేక కార్యదర్శి, పీఈ శాఖ22. ప్రియాంక ఆలా ; ప్రస్తుతం: డైరెక్టర్, మత్స్య శాఖ; బదిలీ: కార్యదర్శి, తెలంగాణ పబ్లిక్ సరీ్వస్ కమిషన్.23. పి. ప్రావీణ్య; ప్రస్తుతం: కలెక్టర్, హనుమకొండ; బదిలీ: కలెక్టర్, సంగారెడ్డి.24. నిర్మలా కాంతివెస్లీ ; బదిలీ: కార్యదర్శి, సీఈవో, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, వీసీ అండ్ ఎండీ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్.25. మిక్కిలినేని మనుచౌదరి; బదిలీ: కలెక్టర్, మేడ్చల్–మల్కాజిగిరి.26. ముజమ్మిల్ ఖాన్; ప్రస్తుతం: కలెక్టర్, ఖమ్మం; బదిలీ: డైరెక్టర్ సివిల్ సప్లయ్స్, సీఆర్వో హైదరాబాద్ (అదనపు బాధ్యతలు).27. స్నేహ శబరీ‹Ù ; ప్రస్తుతం: అదనపు కమిషనర్, జీహెచ్ఎంసీ; బదిలీ: కలెక్టర్, హనుమకొండ 28. అనుదీప్ దురిశెట్టి; ప్రస్తుతం: కలెక్టర్, హైదరాబాద్; బదిలీ: కలెక్టర్, ఖమ్మం29. నవీన్ నికోలస్; ప్రస్తుతం: కార్యదర్శి, టీజీపీఎస్సీ; బదిలీ: డైరెక్టర్, పాఠశాల విద్య, (ఎస్ ఎస్ఏ పీడీగా అదనపు బాధ్యతలు).30. చెక్క ప్రియాంక ; ప్రస్తుతం: ఉప కార్యదర్శి, ఎంఏ అండ్ యూడీ; బదిలీ: స్పెషల్ కమిషనర్, ఐ అండ్ పీఆర్.31. చాహత్ బాజ్‌పేయి; ప్రస్తుతం: కమిషనర్, కరీంనగర్ కార్పొరేషన్; బదిలీ: కమిషనర్, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్.32. అశ్విని తానాజీ వకాడే; బదిలీ: అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) కరీంనగర్33. ప్రఫుల్ దేశాయ్; బదిలీ: కమిషనర్, కరీంనగర్ కార్పొరేషన్.34. షఫీయుల్లా; ప్రస్తుతం: ప్రత్యేక కమిషనర్, గ్రామీణాభివృద్ధి; బదిలీ: కార్యదర్శి, మైనారిటీ సంక్షేమం, కార్యదర్శి, మైనారిటీ స్కూల్స్ (అదనపు బాధ్యతలు)35. వీఎస్ఎన్వీ ప్రసాద్ (ఐఎఫ్ఎస్); బదిలీ: డైరెక్టర్, హెచ్ఎండీ 36. నిఖిల్ చక్రవర్తి; ప్రస్తుతం: ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, టీజీఐఐసీ; బదిలీ: డైరెక్టర్, పరిశ్రమల శాఖ, -
ధరణి సమస్యలకు చెక్.. కలెక్టర్లకు నవీన్ మిట్టల్ కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2.20 లక్షల పెండింగ్ దరఖాస్తులను వీలైనంత త్వరలో పరిష్కరించాలని కలెక్టర్లకు భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) నవీన్ మిట్టల్ ఆదేశాలు జారీ చేశారు. ధరణి సమస్యలపై శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెలాఖరులోగా వీలైనన్ని దరఖాస్తులు పరిష్కరించాలని స్పష్టం చేశారు.పాస్ బుక్ డేటా కరెక్షన్‌లోనే ఎక్కువ దరఖాస్తులు ఉన్నాయి. ధరణిలో 188 టెక్నికల్ సమస్యలు గుర్తించాం. అందులో 163 టెక్నికల్ సమస్యలను పరిష్కరించాం. వారం పది రోజుల్లో మరోసారి భేటీ అవుతాం. ఎన్నికల ప్రక్రియలో భాగంగా పెండింగ్ దరఖాస్తులు పెరిగాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో, అతి తక్కువ ములుగులో పెండింగ్ దరఖాస్తులు ఉన్నాయి. కలెక్టర్లతో పాటు అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీవో లు, తహసీల్దార్లకు ధరణిపై టెక్నికల్ సమస్యలను క్లియర్ చేశాం’’ అని నవీన్ మిట్టల్ వెల్లడించారు. -
జిల్లాల కలెక్టర్లతో CCLA కమిషనర్ నవీన్ మిట్టల్ వీడియో కాన్ఫరెన్స్
-
ఇంటర్ బోర్డు భద్రత వ్యవస్థ ట్యాంపర్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ బోర్డులో భద్రత వ్యవస్థ ట్యాంపరింగ్‌కు గురైందని, కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేశారని బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ వెల్లడించారు. బోర్డులో అత్యంత కీలకమైన సీసీ కెమెరా లకు సంబంధించిన పాస్వర్డ్ చోరీ అయిందని తెలియడంతో అప్రమత్తమైనట్టు తెలిపారు. ఈ విషయం గుర్తించిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దీని వెనుక సూత్రధా రులెవరో, ఏ అవసరాల కోసం ఈ కుట్రకు పాల్పడ్డారో దర్యాప్తులో తేలుతుందన్నారు. నేర చరిత్ర ఉన్న ఓ వ్యక్తి బోర్డు అధికారిని బెదిరించి, భయపెట్టి పాస్‌వర్డ్‌ను తస్కరించినట్టు ప్రాథమికంగా తెలిసిందన్నారు. దీనిపై శాఖాపరమైన విచారణకు ఆదేశాలిచ్చినట్టు మిత్తల్ వెల్లడించారు. ఆన్లైన్ మూల్యాంకనం పూర్తి పారదర్శకం అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాతే ఈ ఏడాది నుంచి ఇంటర్ సమా ధాన పత్రాల ఆన్లైన్ మూల్యాంకనం చేపడుతున్నట్లు మిత్తల్ తెలిపారు. దీనివల్ల మూల్యాంకనం పారదర్శకంగా ఉండటంతోపాటు తప్పుల నివారణ సాధ్య మవుతుందని తెలిపారు. గతంలో విద్యార్థి రీవ్యాల్యూయేషన్ కోరితే జిల్లాల నుంచి పేపర్లు తెప్పించడంలో తీవ్ర జాప్యం జరిగేదని, ఇప్పుడు ఆన్లైన్ చేయడం వల్ల వేగవంతంగా పూర్తవుతుందని చెప్పారు. పేపర్లు దిద్దేవారికి ఇచ్చే టీఏ, డీఏ ఖర్చునూ నివారించవచ్చన్నారు. ఇప్పటికే అన్ని దేశాలూ, విశ్వవిద్యా లయాలు ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయని, ఆన్లైన్ మూల్యాంకనం కోసం అధ్యాపకు లకు అవసరమైన శిక్షణ కూడా ఇస్తామని వివరించారు. ఈ ఏడాది ప్రయోగాత్మ కంగా ఆర్ట్స్, కామర్స్, లాంగ్వేజ్‌లకు సంబంధించిన 35 లక్షల పేపర్లను ఆన్లైన్ ద్వారా వ్యాల్యుయేషన్ చేస్తున్నామని, రెండేళ్లలో ఈ విధానాన్ని పూర్తిగా విస్తరిస్తా మన్నారు. గతంలో జరిగిన విధానంలో ప్రైవేటు కాలేజీలు సమాధాన పత్రాలు ఎక్కడకు వెళ్తున్నాయో తెలుసుకుని వారికి అనుకూలమైన విధానాలు అనుసరించారనే ఆరోపణలున్నాయని, ఇలాంటివి ఇప్పుడు సాగవనే ఉద్దేశంతో ఏసీబీ కేసులున్న ఓ వ్యక్తి పనిగట్టుకుని బోర్డు ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాడని మిత్తల్ చెప్పారు. -
ఇంటర్ ఫీజు గడువు 28
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజును రూ.వెయ్యి ఆలస్య రుసుముతో ఈ నెల 28 వరకూ చెల్లించుకునే అవకాశం కల్పిస్తున్నట్టు ఇంటర్ బోర్డ్ కార్యదర్శి నవీన్ మిత్తల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఫీజు గడువు ఈ నెల 19వ తేదీతో ముగిసింది. విద్యార్థులు, కాలేజీ యాజమాన్యాల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు గడువు పొడిగించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. -
కన్వీనర్ కోటాలో అదనంగా 2,378 సీట్లు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈసారి కన్వీనర్ కోటా సీట్లు పెరిగాయి. 2017–18లో ఈ కోటాలో 62,188 సీట్లు ఉండగా.. ఈసారి (2018–19) 64,566 సీట్లు అందుబాటులో ఉన్నట్టు ప్రవేశాల కన్వీనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. అంటే గతేడాదికన్నా 2,378 సీట్లు పెరిగాయి. ఇందులో అత్యధికంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కోర్సులోనే సీట్లు ఎక్కువగా పెరగడం గమనార్హం. ఐటీలో గతేడాది 2,487 సీట్లు అందుబాటులో ఉండగా.. ఈసారి 3,369 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (ఈఈఈ)లో మాత్రం సీట్లు తగ్గిపోయాయి. ఈ కోర్సు కన్వీనర్ కోటాలో గతేడాది 8,412 సీట్లు ఉండగా.. ఈసారి 8,372 సీట్లు మాత్రమే ఉన్నాయి. మొత్తంగా కన్వీనర్ కోటా సీట్లను కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేసేందుకు ప్రవేశాల క్యాంపు కార్యాలయం చర్యలు చేపట్టింది. గతేడాది 29 కోర్సుల్లో ప్రవేశాలకు చర్యలు చేపట్టగా.. ఈసారి రెండు కొత్త కోర్సులకు అనుమతులు వచ్చాయి. అందులో పెట్రోలియం ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో 42 సీట్లకు, ఫార్మాస్యుటికల్ ఇంజనీరింగ్‌లో 42 సీట్లు కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. టాప్–100లో ముగ్గురే హాజరు ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్‌లో భాగంగా సోమవారం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రారంభమైంది. తొలిరోజున ఒకటో ర్యాంకు నుంచి 10 వేల ర్యాంకు వరకు విద్యార్థులను పిలవగా.. 5,699 మంది వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. అందులో టాప్–100లోపు ర్యాంకులు వచ్చినవారు కేవలం ముగ్గురే ఉండటం గమనార్హం. 101 ర్యాంకు నుంచి 500లోపు ర్యాంకు వారిలోనూ 63 మందే హాజరయ్యారు. ఇక స్పెషల్ కేటగిరీలో భాగంగా ఒకటో ర్యాంకు నుంచి 40 వేల ర్యాంకు వరకున్న ఎన్సీసీ విద్యార్థుల్లో వెరిఫికేషన్‌కు 6,075 మంది హాజరయ్యారు. మంగళవారం (29న) 10,001వ ర్యాంకు నుంచి 25 వేల ర్యాంకు వరకు, ఎన్సీసీ కేటగిరీలో 40,001వ ర్యాంకు నుంచి 80 వేల ర్యాంకు వరకు విద్యార్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతుందని ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ తెలిపారు. వెరిఫికేషన్ పూర్తయిన విద్యార్థులంతా వచ్చే నెల 5వ తేదీలోగా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించారు. -
నవీన్‌మిట్టల్‌కు మెమో
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్ నానల్‌నగర్‌లోని భూములకు నకిలీ పత్రాల ఆధారంగా నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవడంలో తాత్సారం ఎందుకు చేస్తున్నారని ఉమ్మడి హైకోర్టు తెలంగాణ సర్కార్‌ను ప్రశ్నించింది. ఎన్ఓసీ ఇచ్చిన కమిటీలోని వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలన్న సింగిల్ జడ్జి ఆదేశాల్ని అమలు చేయకపోవడానికి కారణమేమిటని బుధవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం నిలదీసింది. బాధ్యులపై చర్యలకు మీనమేషాలు లెక్కిస్తున్నారనే అభిప్రాయం ఏర్పడుతోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మీనాను స్వయంగా హాజరుకావాలన్న ఆదేశాల తర్వాతే అప్పటి హైదరాబాద్ కలెక్టర్ నవీన్‌మిట్టల్‌కు మెమో ఇచ్చారని హైకోర్టు పేర్కొంది. నిరభ్యంతర పత్రం ఇచ్చిన అప్పటి హైదరాబాద్ కలెక్టర్‌గా ఉన్న ఎన్ఓసీ చైర్మన్ నవీన్‌మిట్టల్, సంయుక్త కలెక్టర్ దుర్గాప్రసాద్, అధికారులు వెంకటరెడ్డి, పి.మధుసూధన్‌రెడ్డి ఇతరులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సింగిల్ జడ్జి ఆదేశించారు. దీనిని సవాల్ చేస్తూ నవీన్‌మిట్టల్, సయ్యద్ వేరువేరుగా అప్పీల్ పిటిషన్లు వేశారు. వీటిని ధర్మాసనం విచారించింది. సయ్యద్, మరో ఇద్దరిని ప్రాసిక్యూషన్ జరపాలని గతంలో సింగిల్ జడ్జి ఆదేశిస్తే.. కోర్టు తీర్పు ప్రతితో తహసీల్దార్ పోలీసులకు ఎలా ఫిర్యాదు చేస్తారని ధర్మాసనం తప్పుపట్టింది. దీంతో అడ్వొకేట్ జనరల్ దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి చెప్పారు. సయ్యద్ మరో ఇద్దరిపై ప్రాసిక్యూషన్ ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. విచారణ మూడు వారాలకు వాయిదా పడింది. -
జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్లు ఇవ్వండి
నవీన్ మిట్టల్‌కు మంత్రి కేటీఆర్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఎలాంటి నిబంధనలు, అడ్డంకులు సృష్టించకుండా జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు జారీ చేయాలని రాష్ట్ర సమాచార, ప్రజా సంబంధాల శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్‌ను రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కె.తారకరామారావు ఆదేశించారు. అక్రెడిటేషన్ల జారీకి డిగ్రీ సర్టిఫికెట్లతో ముడిపెట్టడం, చిన్న పత్రికలకు అక్రెడిటేషన్ల జారీపై ఆంక్షలు విధించడం, అక్రెడిటేషన్లతో సంబంధం లేకుండా హెల్త్ కార్డులు జారీ కాకపోవడం పట్ల బుధవారం పలు జర్నలిస్టు యూనియన్లు సచివాలయంలో మంత్రిని కలసి ఫిర్యాదు చేశాయి. దీనికి స్పందించిన కేటీఆర్.. నవీన్ మిట్టల్‌తో మాట్లాడారు. డిగ్రీ విద్యార్హతతో సంబంధం లేకుండా జిల్లాల్లో చిన్న పత్రికలకు వెంటనే అక్రెడిటేషన్లు జారీ చేయాలని ఆదేశించారు. రాష్ట్ర స్థాయి అక్రెడిటేషన్ ఉన్న జర్నలిస్టులకు ఏసీ బస్సుల్లో ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పాత జిల్లాల ప్రకారమే జర్నలిస్టులకు బస్‌పాస్‌లు జారీ చేయాలని మంత్రి మహేందర్‌రెడ్డిని కోరారు. కేటీఆర్‌ను కలసిన వారిలో ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, పలు యూనియన్ల నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
స్థానిక ‘ఉప’ సమరం
విశాఖపట్నం/నక్కపల్లి: జిల్లాలో నాలుగు పంచాయతీ సర్పంచ్‌లు, 124 వార్డు సభ్యులు, 21 ఎంపీటీసీ సభ్యుల ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇందుకు ఏర్పాట్లు, బడ్జెట్ కేటాయింపులు చేసుకోవాలని ఎన్నికల సంఘ కార్యదర్శి నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రక్రియలో భాగంగా మొదటి దశలో పోలింగ్స్టేషన్ల ముసాయిదా ప్రకటన, అభ్యంతరాల స్వీకరణ, పరిశీలన, తుదిజాబితా ప్రకటనవంటి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గతంలో ఎన్నికలప్పుడు నామినేషన్ దాఖలుకాని పంచాయతీల్లోను, ఎన్నికల అనంతరం వివిధ కారణాల వల్ల ఖాళీఅయిన సర్పంచ్, వార్డు సభ్యులు, ఎంపీటీసీ సభ్యుల పదవుల ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఈనెల 15న పోలింగ్స్టేషన్ల ముసాయిదా ప్రకటిస్తారు. వీటిపై అభ్యంతరాలను 17న స్వీకరిస్తారు. 18న పరిశీలన,19న తుదిజాబితా ప్రకటిస్తారు. ఈమేరకు ఏఏ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలన్నదానిపై జిల్లాపరిషత్ అధికారులు దృష్టి సారించారు. షెడ్యూల్ వెలువడిన వెంటనే ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. ఈ ఏడాది మార్చి పదో తేదీన ప్రకటించిన ఓటర్ల జాబితా ఆధారంగానే ఎన్నికలు నిర్వహిస్తారు. 2013లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఉపయోగించిన గుర్తులనే ఇప్పుడూ వాడాలని ఎన్నికలసంఘం నిర్ణయించింది. ఏజెన్సీ పరిధి జీకేవీధి మండలం గాలికొండ, చింతపల్లి మండలం బలపం పంచాయతీలకు అప్పట్లో నామినేషన్లు దాఖలుకాలేదు. ఈ రెండు పంచాయతీల్లో సర్పంచ్‌తోపాటు అన్ని వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తారు. నాతవరం మండలం విబి అగ్రహారం సర్పంచ్ చనిపోయారు. నర్సీపట్నం మండలం ధర్మసాగరం సర్పంచ్ రాజీనామా చేశారు. ఈ రెండు చోట్ల సర్పంచ్ పదవులకు మాత్రమే ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. వార్డుల విషయానికొస్తే దేవరాపల్లిమండలం కొత్తపల్లి,కాశీపురం, పరవాడమండలం కన్నూరు,రావాడ, పెందుర్తిమండలం ఎస్ఆర్పురం, సబ్బవరం మండలం పైడివాడఆగ్రహారం, అమృతపురం,అచ్చుతాపురం మండలం దోసూరు, పెదపాడు,మాడుగుల మండలం ఎం.కోడూరు, ముకుందపురం, మాకవారిపాలెం మండలం కోడూరు, కే. అగ్రహారం, నక్కపల్లిమండలం గొడిచర్ల, ముకుందరాజుపేట, నర్సీపట్నంమండలం వేములపూడి,పాయకరావుపేటమండలం పి.లక్ష్మీపురం, సీతారాంపురం, యలమంచిలి మండలం లక్కవరం, రాంబిల్లి మండలం కుమార పల్లి, జీకేవీధి మండలం మొండిగెడ్డ,జర్రెల, చింతపల్లిమండంలో తమ్మంగుల, కుడుమసారె, ముంచంగిపుట్టు మండలం రంగబయలు, బుంగాపుట్టు,బోసిపుట్టు,అనంతగిరి మండలం ఎన్ఆర్పురం, లుంగపర్తి, గుమ్మకోట, పెదబయలుమండలం జమ్మిగుడ, కుంతర్ల,బొంగరం, లింగేటి,గుల్లెలు, గొమ్మంగి, కొయ్యూరు మండలం బూదరాళ్ల, మంప, రేవళ్లు గ్రామాల్లో వివిధ కారణాలతో ఖాళీ అయిన వార్డులకు ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ ఎంపీటీసీ సెగ్మెంట్లకు.. జిల్లాలోని 8 మండలాల్లో 21 ఎంపీటీసీ స్థానాలకు వివిధ కారణాల వల్ల ఎన్నిక నిర్వహించలేదు. చింతపల్లి మండలం చింతపల్లి-1, చింతపల్లి-2, గొందిపాకలు, కుడుంసారె, తమ్మంగుల సెగ్మెట్లు, పాడేరు మండలం వంట్లమామిడి, వి. మాడుగుల మండలం మాడుగుల-2, మాడుగుల-3, కె.జె.పురం-2, పెదబయలు మండలం జామిగూడ, ఇంజరి , జి.మాడుగుల మండలం గడుతూరు, గెమ్మిలి, కోరాపల్లి , కోటవురట్ల మండలం కోటవుట్ల-2 , పాయకరావు పేట మండలం పాయకరావుపేట-7, కుమరాపురం , ముంచంగిపుట్టు మండలం మాకవరం, పెదగూడ, బరడ ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. -
ఇక రెండు రాష్ట్రాల్లోనూ వైఎస్సార్ సీపీకి గుర్తింపు
హైదరాబాద్: ఇక కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కూడా వైఎస్సార్ సీపీ గుర్తింపు లభించింది. ఈ మేరకు మంగళవారం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఈసీ లేఖ రాసింది. ఉభయ రాష్ట్రాల్లోనూ వైఎస్సార్ సీపీకి సీలింగ్ ఫ్యాన్ గుర్తు కేటాయిస్తున్నట్లు పేర్కొంది. అంతకముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో వైఎస్సార్ సీపీ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆ పార్టీ గుర్తుగా ఉన్న సీలింగ్ ఫ్యాన్‌ను ఇక రెండు రాష్ట్ర్రాలో శాశ్వత ప్రాతిపదికన ఆ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులకే కేటాయించడం జరుగుతుంది. -
వైఎస్సార్ సీపీకి రాష్ట్ర ఈసీ ‘గుర్తింపు’
* రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ * మున్సిపల్, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో విప్ జారీ అధికారం సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ఎన్నికల కమిషన్ గుర్తింపు కూడా లభించింది. ఇప్పటి వరకూ రిజిస్టర్డ పార్టీగానే పరిగణిస్తూ వచ్చిన ఈ పార్టీని ఇకపై గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీగా పేర్కొంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి నవీన్ మిట్టల్ గురువారం నోటిఫికేషన్ జారీ చేశారు. వైఎస్సార్సీపీ గుర్తింపు పొందిన పార్టీ కాదని, ఆ పార్టీకి స్థానిక సంస్థ ల పాలకవర్గాల ఎన్నికల్లో ‘విప్’ జారీ చేసే అధికారం లేదంటూ రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారానికి దీంతో తెరపడింది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే వైఎస్సార్ సీపీని గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీగా పరిగణిస్తూ ఆదేశాలిచ్చినందున, ఆ నిర్ణయాన్ని అనుసరించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా అదే విధమైన ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో శాసనసభ, కేంద్రంలో లోక్‌సభ కొలువుదీరిన అనంతరం జరగబోయే మండల, జిల్లా పరిషత్ అధ్యక్ష పదవులు, మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ పదవులకు జరిగే ఎన్నికల్లో తమ పార్టీ సభ్యులకు ఫలానా వారికి ఓటు చేయాలని ‘విప్’ (ఆదేశాలు) జారీ చేసే అధికారం వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఇపుడు లభించింది. స్థానిక సంస్థల చట్టాలను పరిశీలించి నిర్ణయం.. కేంద్ర ఎన్నికల కమిషన్ తమకు గుర్తింపు ఇచ్చిన విషయాన్ని తెలియజేస్తూ వైఎస్సార్సీపీ సంస్థాగత వ్యవహారాల రాష్ట్ర కో-ఆర్డినేటర్ ఈ నెల 27న తమకు ఒక లేఖను సమర్పించారని, దానిలోని అంశాలను పరిశీలించి తాము ఈ గుర్తింపునిస్తున్నామని రాష్ట్ర కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. ఏపీ పంచాయతీరాజ్ చట్టం-1994, జీహెచ్ఎంసీ చట్టం- 1955, ఏపీ మున్సిపాలిటీల చట్టం-1965 ప్రకారం, 1968లో జారీ అయిన కేంద్ర ఎన్నికల కమిషన్ చిహ్నా ల కేటాయింపు ఆదేశాల ప్రకారం వైఎస్సార్సీపీ అన్ని రకాల అర్హతలను పూర్తి చేసినందున గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీ హోదా ఇవ్వడంతో పాటు ‘సీలింగ్ ఫ్యాన్’ చిహ్నాన్ని కేటాయిస్తున్నట్లు కమిషన్ పేర్కొంది. -
‘మాఫియా గుప్పెట్లో రాష్ట్రం’ పుస్తకంపై విచారణకు ఆదేశం
జిల్లా కలెక్టర్‌కు ఉత్తర్వులు జారీ చేసిన నవీన్‌మిట్టల్ పుస్తక ప్రచురణకర్త వర్ల రామయ్యపై జంపాన కొండలరావు ఫిర్యాదు ఉయ్యూరు, న్యూస్‌లైన్ :‘మాఫియా గుప్పెట్లో రాష్ట్రం’ పుస్తక పంపిణీపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించింది. వైఎస్సార్ సీపీ ఉయ్యూరు మున్సిపల్ రెండో వార్డు అభ్యర్ధి జంపాన కొండలరావు ఫిర్యాదు మేరకు విచారణకు ఆదేశిం చింది. జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి నవీన్‌మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే... గత నెల 30న జరిగిన ఉయ్యూరు మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసి తప్పుదోవ పట్టించేందుకు టీడీపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడింది. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ప్రచురించిన ‘మాఫియా గుప్పెట్లో రాష్ట్రం’ పుస్తకాలను ఇంటింటికీ పంపిణీ చేసింది. వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డితోపాటు మరి కొంత మందిపై అసత్య ఆరోపణలతో బురదజల్లింది. ఈ చర్యలను పార్టీ పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త పడమట సురేష్‌బాబు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు అడ్డుకున్నారు. ఈ పుస్తక పంపిణీపై ఎన్నికల ప్రత్యేక అధికారి పుష్పమణి, ఎన్నికల అధికారి శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. ఘటనపై విచారణకు ఆదేశించి చర్యలు చేపట్టకపోవడంతో జంపాన కొండల రావు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఈ నెల ఒకటో తేదీన ఫిర్యాదు చేశారు. పుస్తక పంపిణీ ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని, ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు సరికాదని, పుస్తక ప్రచురణకర్త వర్ల రామయ్య ఈ మున్సిపాలిటీలో పోటీ చేసిన వ్యక్తి కాదు, ఓటరు కాదని, అలాంటి వ్యక్తి ఎలాంటి అనుమతి లేకుండా పుస్తకాలను ముద్రించి ఎలా పంపిణీ చేస్తారని పేర్కొన్నారు. వర్ల రామయ్య గతంలో ఉయ్యూరు సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేశారని, అనేక ఎన్నికల నిర్వహణలో బాధ్యతలు నిర్వర్తించిన వ్యక్తే ఇలా నిబంధనలు ఉల్లంఘిం చడం సరైందికాదని, చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పొందుపరిచారు. ఫిర్యాదు స్వీకరించిన సంఘం కార్యదర్శి నవీన్‌మిట్టల్ విచారణకు ఆదేశించారు. పుస్తక పంపిణీపై సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాల్సిందిగా సూచిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.