జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించిన ఎంసెట్ ప్రశాంతంగా ముగిసింది. ఇంజినీరింగ్ కోసం 12,497 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 11,804 మంది పరీక్షకు హాజరయ్యూరు.
జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించిన ఎంసెట్ ప్రశాంతంగా ముగిసింది. ఇంజినీరింగ్ కోసం 12,497 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 11,804 మంది పరీక్షకు హాజరయ్యూరు. మెడిసిన్, అగ్రికల్చర్ కోసం 4,940 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 4,594 మంది హాజరయ్యూరు. కరీంన గర్ సిటీ, నగరశివారు, ఎల్‌ఎండీలో కలిపి మొత్తం 36 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇంజినీరింగ్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు మెడిసిన్ పరీక్ష నిర్వహించారు.
స్టేట్ అబ్జర్వర్ ప్రొఫెసర్ శ్రీనివాస్, జిల్లా రీజినల్ కో ఆర్డినేటర్ డాక్టర్ పి.రమేశ్ పరీక్ష కేంద్రాలను పర్యవేక్షించారు. కరీంనగర్ మహిళా డిగ్రీ కళాశాల కేంద్రానికి ముగ్గురు, కిమ్స్ డిగ్రీ కళాశాలకు నలుగురు నిమిషం ఆలస్యంగా రావడంతో అనుమతివ్వలేదు. ఎంసెట్ సందర్భంగా విద్యార్థులు సహా తల్లిదండ్రులు, బంధువులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో కరీంనగర్‌లోని హోటళ్లు, రహదారులు, బస్టాండ్ ప్రాంతాలు రద్దీగా మారారుు.