పాఠశాలలో మద్యం తాగి అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు పడింది. డీఈవో విశ్వనాథరావు శనివారం ....
నల్గొండ : పాఠశాలలో మద్యం తాగి అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు పడింది. డీఈవో విశ్వనాథరావు శనివారం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. దేవరకొండ మండలం గొట్టిముక్కల ప్రాధమికోన్నత పాఠశాలలో గురువారం హలీం అనే ఉపాధ్యాయుడు వీరంగం సృష్టించిన ఉదంతాన్ని పత్రికులు, టీవీ ఛానళ్లలో రావటంతో విద్యాశాఖ మంత్రితో పాటు, ఉన్నతాధికారులు ఈ ఉదంతాన్ని తీవ్రంగా పరిగణించారు. దీంతో జిల్లా విద్యాశాఖ టీచర్ తతంగంపై నివేదిక తయారు చేసి సస్పెండ్ చేసింది.