‘తరగతి గదుల్లో సీసీ కెమెరాలు వద్దు’ | dont use cc cameras in class rooms says mv reddy | Sakshi
Sakshi News home page

‘తరగతి గదుల్లో సీసీ కెమెరాలు వద్దు’

Mar 12 2016 3:19 AM | Updated on Aug 14 2018 3:37 PM

పాలిటెక్నిక్ కాలేజీల్లోని తరగతి గదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయవద్దని, కళాశాల ఆవరణ, వరండాలు, ప్రవేశ ద్వారాల్లోనే ఏర్పాటు చేయాలని సాంకేతిక విద్యా డెరైక్టర్ ఎంవీరెడ్డి పాలిటెక్నిక్ కాలేజీల ప్రిన్సిపాళ్లను ఆదేశించారు.

సాక్షి, హైదరాబాద్: పాలిటెక్నిక్ కాలేజీల్లోని తరగతి గదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయవద్దని,  కళాశాల ఆవరణ, వరండాలు, ప్రవేశ ద్వారాల్లోనే ఏర్పాటు చేయాలని సాంకేతిక విద్యా డెరైక్టర్ ఎంవీరెడ్డి పాలిటెక్నిక్ కాలేజీల ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో ఆయన ప్రిన్సిపాళ్లతో వచ్చే నెల 21న పాలీసెట్-2016 నిర్వహణ, 2016-17 అకడమిక్ ప్రణాళికపై సమీక్షించారు.

సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని, పరీక్ష కేంద్రాలుగా ఉండే కాలేజీల్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement