కుక్క దాడిలో 19 మేకలు మృతి | Dog kills 19 goats | Sakshi
Sakshi News home page

కుక్క దాడిలో 19 మేకలు మృతి

Nov 27 2015 4:28 PM | Updated on Sep 29 2018 3:55 PM

ఇంట్లో కట్టేసి ఉన్న మేకలపై కుక్క దాడి చేసిన ఘటనలో 19 మేకలు మృతిచెందాయి. ఈ ఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం హర్జనాపురం తండాలో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.

చింతపల్లి (నల్లగొండ) : ఇంట్లో కట్టేసి ఉన్న మేకలపై కుక్క దాడి చేసిన ఘటనలో 19 మేకలు మృతిచెందాయి. ఈ ఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం హర్జనాపురం తండాలో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. తండాకు చెందిన ఓ రైతు మేకలను ఇంట్లో కట్టేసి పని మీద పక్క ఊరికు వెళ్లి వచ్చేసరికి ఇంట్లో ఉన్న మేకలను కుక్క చంపేసింది. దీంతో రైతు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement