రాజ్‌భవన్‌లో ఘనంగా దీపావళి వేడుకలు

Diwali Celebrations By Governor Tamilisai Soundararajan In Raj Bhavan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాజ్‌భవన్‌లో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. తమిళిసై మాట్లాడుతూ.. దీపావళి పండుగను ప్రజలందరూ ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు.  తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్‌గా రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.తెలంగాణ ప్రజలందరూ నన్ను అక్కలాగా భావిస్తున్నారని పేర్కొన్నారు. రాజభవన్‌లో ప్లాస్టిక్‌ను నిషేదించడంతో పాటు ఎప్పుడు పచ్చదనం ఉండేలా  నిర్ణయించామని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్‌ రహిత వస్తువులను రాజ్‌భవన్‌లో నిషేదించినట్లు వెల్లడించారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో గిరిజన ఆశ్రమ పాఠశాలలను ఏర్పాటు చేయడం హర్షించతగ్గ విషయం. టీడీపీ అధ్యక్షుడు ఎల్‌ రమణ, రావుల చంద్రశేఖర్‌ రెడ్డి, బీసీ కమిషన్‌ చైర్మన్‌ రాములు తదితరులు గవర్నర్‌ దంపతులను కలిసి వారికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్టీసీ సమస్యలకు సంబంధించి గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఆర్టీసీ సమస్యను ప్రభుత్వమే చూసుకుంటుందని తమిళిసై తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top