గత జూలై 1 నుంచి 7వ తేదీ వరకు జరిగిన డిజిటల్ ఇండియా వారోత్సవాల్లో వరంగల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి కేంద్ర ప్రభుత్వ పురస్కారానికి ఎంపికయ్యాయి.
సాక్షి, హైదరాబాద్: గత జూలై 1 నుంచి 7వ తేదీ వరకు జరిగిన డిజిటల్ ఇండియా వారోత్సవాల్లో వరంగల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి కేంద్ర ప్రభుత్వ పురస్కారానికి ఎంపికయ్యాయి. కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ అజయ్‌కుమార్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్ శర్మకు ఈ మేరకు సమాచారం అందింది. సుపరిపాలన దినోత్సవం సందర్భంగా ఈ నెల 28న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ పురస్కారాలను అందజేయనున్నారు.