జిల్లాల పర్యటనకు డీజీపీ.. | DGP for touring districts | Sakshi
Sakshi News home page

జిల్లాల పర్యటనకు డీజీపీ..

Jun 23 2017 2:17 AM | Updated on Sep 5 2017 2:14 PM

జిల్లాల పర్యటనకు డీజీపీ..

జిల్లాల పర్యటనకు డీజీపీ..

మంచిర్యాల, రామగుండం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్‌లలో డీజీపీ అనురాగ్‌ శర్మ రెండు రోజుల పాటు పర్యటించనున్నారు.

హైదరాబాద్‌: మంచిర్యాల, రామగుండం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్‌లలో డీజీపీ అనురాగ్‌ శర్మ రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. శుక్రవారం, శనివారం సాగే ఈ పర్యటనలో కొత్త జిల్లాల పోలీసింగ్, శాంతి భద్రతల పటిష్టత, నేరాల నియంత్రణ, గోదావరిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులు వాటి భద్రత తదితర అంశాలకు సంబంధించి అధికారులతో భేటీ కానున్నట్లు తెలిసింది.

మావోల నియంత్రణా చర్యలపై కమిషనర్లు, ఎస్పీల కు దిశానిర్దేశం చేయనున్నారని పోలీస్‌ వర్గాలు తెలిపాయి. కొత్తగా నిర్మించాల్సిన జిల్లా పోలీస్‌ హెడ్‌క్వార్టర్లు, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ బ్యారక్, పరేడ్‌ గ్రౌండ్‌.. తదితర భవనాలకు సంబంధించి స్థలాల పరిశీలనను కూడా డీజీపీ ఆరా తీయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement