దైవదర్శానానికి వచ్చి వరదల్లో చిక్కుకున్న భక్తులు మమ్మల్ని రక్షించాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు
మూసీ వరదలో చిక్కుకున్న భక్తులు
Sep 14 2017 6:35 PM | Updated on Sep 19 2017 4:33 PM
సాక్షి, యాదాద్రి భువనగిరి: హైదరాబాద్ నగరంలో కురిసిన వర్షాలకు మూసీ నది వరదాల పారుతోంది. దైవదర్శానానికి వచ్చి వరదల్లో చిక్కుకున్న భక్తులు మమ్మల్ని రక్షించాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలోని వలిగొండ మండలం భీమలింగంలో చోటుచేసుకుంది. గ్రామంలోని కత్వా వద్ద నదిలో ఉన్న శివలింగం దర్శనం కోసం వెళ్లిన ఆరుగురు భక్తులతో పాటు ఇద్దరు పశువుల కాపర్లు వరదలో చిక్కుకుపోయారు.
ఒక్కసారిగా మూసీ నది వరద పెరగడంతో గుడి పైకి ఎక్కి రక్షించాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చిక్కుకున్న భక్తుల వద్దకు వెళ్లడానికి అన్ని విధాల ప్రయత్నిస్తున్నారు. హెలికాఫ్టర్‌ని తెప్పించాలనే యోచనలో పోలీసులున్నట్లు తెలుస్తోంది. సంఘటనాస్థలానికి స్థానిక డీఎస్పీతో పాటు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి చేరుకున్నారు. వారిని రక్షించేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ దళాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
Advertisement
Advertisement