breaking news
Musi Floods
-
Hyderabad Floods Photos: నిండా ముంచేసిన మూసీనది (ఫొటోలు)
-
మూసీనదికి తెలంగాణ ప్రభుత్వం శాంతి పూజలు
-
మూసీకి పోటెత్తిన వరద
నల్లగొండ, కేతేపల్లి (నకిరేకల్) : ఉమ్మడి జిల్లాలో నాగార్జునసాగర్ తర్వాత అతిపెద్ద సాగునీటి వనరుగా ఉన్న మూసీ రిజర్వాయర్‌కు మంగళవారం ఎగువ నుంచి ఇన్‌ఫ్లో భారీగా వస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు 6 గేట్లను ఎత్తి వరదనీటిని దిగువకు వదులుతున్నారు. హైదరాబాద్ నగరంతో పాటు మూసీ ఎగువ, పరిసర ప్రాంతాల్లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో బిక్కేరు, మూసీ వాగులు ఉధృతంగా ప్రవహిస్తుయి. ఆయా వాగుల ద్వారా మూసీ రిజర్వాయర్‌లోకి మంగళవారం ఉదయం ఐదు వేల క్యూసెక్కుల వరద వస్తోంది. హైదరాబాద్‌లో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఇన్‌ఫ్లో మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే ప్రాజెక్ట్ నీటిమట్టం 645 అడుగుల పూర్తిస్థాయికి చేరువలో ఉండటంతో, ఇన్‌ఫ్లో పెరిగే అవకాశాలు ఉండటంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టులో నీటిమట్టాన్ని తగ్గించాలని నిర్ణయించారు. దీంతో మంగళవారం ఉదయం 2, 3, 4, 7, 8, 10వ నంబర్ క్రస్ట్ గేట్లను మూడు అడుగుల మేర ఎత్తి 12,000 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. మూసీ కుడి, ఎడమ కాల్వలకు 250 క్యూసెక్కుల చొప్పున వదులుతున్నారు. ప్రాజెక్టు నీటిమట్టం 643 అడుగుల వద్ద నిలకడగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. 4.4 టీఎంసీ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం గల మూసీ రిజర్వాయర్‌లో 4.3 టీఎంసీల నిల్వ ఉందని అధికారులు తెలిపారు. మూసీ వద్ద సందర్శకుల సందడి.. మూసీగేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతుండటంతో ప్రాజెక్టు వద్ద మంగళవారం సందర్శకులు సందడి నెలకుంది. ప్రాజెక్టు ఆరు గేట్లు ఎత్తిన విషయం తెలుసుకున్న కేతేపల్లి, సూర్యాపేట, నకిరేకల్, అర్వపల్లి తదితర మండలాల ప్రజలు డ్యాం వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. దిగువకు వెళ్తున్న నీటిని తమ ఫోన్ కెమెరాల్లో బంధిస్తున్నారు. మూసీ ఉధృతంగా ప్రవహిస్తుండడంతో 65వ నంబర్ జాతీయ రహదారిపై వెళ్లే ప్రయాణికులతో పాటు సమీప గ్రామాల ప్రజలు అక్కడ తమ వాహనాలను నిలిపి.. సెల్ఫీలు దిగుతూ ఆనందంగా గడిపారు. -
మూసీ వరదలో చిక్కుకున్న భక్తులు
సాక్షి, యాదాద్రి భువనగిరి: హైదరాబాద్ నగరంలో కురిసిన వర్షాలకు మూసీ నది వరదాల పారుతోంది. దైవదర్శానానికి వచ్చి వరదల్లో చిక్కుకున్న భక్తులు మమ్మల్ని రక్షించాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలోని వలిగొండ మండలం భీమలింగంలో చోటుచేసుకుంది. గ్రామంలోని కత్వా వద్ద నదిలో ఉన్న శివలింగం దర్శనం కోసం వెళ్లిన ఆరుగురు భక్తులతో పాటు ఇద్దరు పశువుల కాపర్లు వరదలో చిక్కుకుపోయారు. ఒక్కసారిగా మూసీ నది వరద పెరగడంతో గుడి పైకి ఎక్కి రక్షించాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చిక్కుకున్న భక్తుల వద్దకు వెళ్లడానికి అన్ని విధాల ప్రయత్నిస్తున్నారు. హెలికాఫ్టర్‌ని తెప్పించాలనే యోచనలో పోలీసులున్నట్లు తెలుస్తోంది. సంఘటనాస్థలానికి స్థానిక డీఎస్పీతో పాటు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి చేరుకున్నారు. వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ దళాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.