అభివృద్ధిని విస్మరించారు

The Development Has Been Ignored - Sakshi

మంథని వెనుకబాటుకు గత పాలకులు కారణం

టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పుట్ట మధు

పెద్దపల్లి : మంథని నియోజకవర్గాన్ని అరవై సంవత్సరాలు పాలించిన నాయకులు అభివృద్ధిని విస్మరించడంతో వెనుకబాటును ఎదుర్కొంటుందని టీఆర్‌ఎస్‌ మంథని అసెంబ్లీ అభ్యర్థి పుట్ట మధు అన్నారు. ఆదివారం మండలం ఎగ్లాస్‌పూర్, నెల్లిపల్లి,గుంజపడుగు, ఉప్పట్లతో పాటు మంథని మున్సిపాలిటీలో వ్యాపార కూడలిలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మా పాలనలో అభివృద్ధి చేసామని మాజీ మంత్రి శ్రీధర్‌బాబు పదే పదే చెబుతున్నారని, ఒక్క పని కూడూ చేయకుండా తాము అభివృద్ధి్ద చే శామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రజలకు ఎన్నికల్లో మాట ఇచ్చిన విధంగా వారికి అందుబాటులో ఉంటూ అభివృద్ధి చేసానన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడిప్రజలకు సేవచేసామన్నారు. మరోసారి అవకాశం మరింత అధ్భుతంగా అభివృద్ధి్ద చూపిస్తామన్నారు. ఎంపీపీ ఏగోళపు కమల, మండల కో–ఆప్షన్‌ సభ్యుడు యాకూబ్,మండల పార్టీ అధ్యక్షుడు కొండ శంకర్, పట్టణ శాఖ అధ్యక్షుడు అరెపల్లి కుమార్,మంథని మాజీ సర్పంచ్‌ పుట్ట శైలజ, నాయకులు ఏగోళపు శంకర్‌తో పాటు తదితరులు ఉన్నారు. 

పల్లీలు విక్రయిస్తూ...
పెద్దపల్లి జిల్లా మంథని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పుట్ట మధు ఆదివారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. చికెన్‌ మార్కెట్‌లో,  కూరగాయల మార్కెట్‌లో పల్లీలు విక్రయించారు. కటింగ్‌ షాపులో కటింగ్‌ చేస్తూ ఓట్లు అభ్యర్థించారు.  

టీఆర్‌ఎస్‌లో చేరిక 
కమాన్‌పూర్‌: మండలంలోని గుండారం గ్రామ మాజీ సర్పంచ్‌ పిడుగు నర్సయ్య ఆదివారం టీఆర్‌ఎస్‌లో చేరారు. నర్సయ్య టీడీపీ ప్రభుత్వ హయంలో సర్పంచ్‌గా కొనసాగారు. పార్టీలో చేరిన పిడుగు నర్సయ్యకు పుట్ట మధు కండువవేసి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల శాఖ అధ్యక్షులు పిన్‌రెడ్డి కిషన్‌రెడ్డి, గుండారం తాజా మాజీ సర్పంచ్‌ ఆకుల గట్టయ్యలతో పాటు తదితరులున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top