
అభివృద్ధే లక్ష్యం
జిల్లా సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని కలెక్టర్ వాకాటి కరుణ అన్నారు.
‘హృదయ్’
మనకు గర్వకారణం
చిత్తశుద్ధితో చెరువుల పునరుద్ధరణ
‘పది’లో ప్రథమ స్థానానికి ప్రణాళికలు
గణతంత్ర వేడుకల్లో కలెక్టర్ వాకాటి కరుణ
హన్మకొండ అర్బన్ :
జిల్లా సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని కలెక్టర్ వాకాటి కరుణ అన్నారు. అభివృద్ధే లక్ష్యంగా అందరం ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. గణతంత్ర వేడుకలు సోమవారం జిల్లా వ్యాప్తంగా అంబరాన్నంటారుు. వాడవాడలా మువ్వన్నెల జెండా అభివృద్ధే లక్ష్యం. హన్మకొండ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన వేడుకల్లో కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీస్ వందనం స్వీకరించారు. అనంతరం స్వాతంత్య్ర సమర యోధులను ఘనంగా సన్మానించారు. ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఆ తర్వాత ప్రజలనుద్ధేశించి కరుణ మాట్లాడారు. స్వరాష్ట్రంలో తొలి గణతంత్ర వేడుకల సందర్భంలో జిల్లాకు సంబంధించి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. కలెక్టర్ ఏమన్నారో ఆమె మాటల్లోనే...
ఆరోగ్య వర్సిటీ, ఇళ్ల నిర్మాణాలు తొలి అడుగులు
‘తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అత్యంత ప్రాధాన్యం గల జిల్లా ఓరుగల్లు. ఈ జిల్లా సమగ్రాభివృద్ధిలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగాపర్యటించి, పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. నగరానికి మణిహారంలా 73 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు, ప్రధానరోడ్ల అభివృద్ధి, లక్ష పవర్‌లూమ్స్‌తో టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. జిల్లా ప్రజల పక్షాన కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. నగరంలోని 9 మురికివాడల్లో రూ.400కోట్లతో 4 వేల ఇళ్ల నిర్మాణాలకు నిధులు విడుదల చేయడం, జిల్లాలో ఆరోగ్య విశ్వవిద్యాలయ ఏర్పాటు జిల్లా అభివృద్ధిలో తొలి అడుగులు.
‘హృదయ్’ గర్వకారణం
ప్రపంచ వారసత్వ నగరంగా వరంగల్‌ను కేంద్ర ప్రభుత్వం గుర్తించడం... రూ.40.54కోట్లు విడుదల చేయడం మనకెంతో గర్వకారణం. జిల్లాలో ఇప్పటివరకు 9.43లక్షల ఆహారభద్రత కార్డులు, పేదలకు ఆసరా పింఛన్లు అందజేస్తున్నాం. జిల్లాలోని 3.50లక్షల మంది విద్యార్థుల భోజనానికి సన్నబియ్యం అందిస్తున్నాం. కాకతీయ కాలం నాటి చెరువుల పునరుద్ధరణకు చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం మిషన్ కాకతీయ. ఈ ప్రాజెక్టు కింద జిల్లాలోని 5,839 చెరువులను పనురుద్ధరించాలని నిర్ణయించాం. ఇందులో మొదటి విడత రూ.586.50కోట్లతో 1173 చెరువుల పునరుద్ధరణ పనులు చేపడుతున్నాం. జిల్లాలో రైతులకు మొదటి విడత రూ.472 కోట్ల వ్యసాయ రుణాలు మాఫీ చేశాం. భూమిలేని ఎస్సీ, ఎస్టీ నిరుపేదలకు సంబంధించి భూ కొనుగోలుకు ఇప్పటివరకు రూ.157 కోట్లు విడుదలయ్యూరుు. జిల్లాలో అతివృష్టి, అనావృష్టి కారణంగా నష్టపోయిన రైతాంగానికి రూ.54 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ అందజేశాం. రూ. 24.60 కోట్లతో 19 సబ్‌స్టేషన్ల నిర్మాణం కొనసాగుతోంది. ప్రత్యామ్నాయ విద్యుత్ ఉత్పత్తిలో భాగంగా సౌరశక్తి ప్లాంట్ల నిర్మాణానికి 50 శాతం రాయితీతో పరికరాలు అందజేస్తున్నాం.
రూ.4070 కోట్లతో వాటర్‌గ్రిడ్ పనులు
జిల్లాలో ప్రజలందిరికీ సురక్షిత తాగునీరు అందజేసేందుకు *4070కోట్లతో 5ప్రాంతాల్లో వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టులు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్దం చేయడం జరిగింది. అదేవిదంగా వేసిలో నీటి ఎద్దడి నావారణకు *50కోట్లతో వారం రోజుల కాంటిజెంట్ ప్లాన్ రూపొందించాం. ప్రజారోగ్యంకోసం ఎంజీఎంలో 24గంటలు అందుబాటులో ఉండే వదంగా ప్రత్యేక సైన్‌ఫ్లూ వార్డు ఏర్పాటు చేయడం జరిగింది. సహాయంకోసం టోల్‌ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉంచాం. నూతన ఆసుపత్రుల నిర్మాణం, అధునీకరణ పనులకోసం ప్రభుత్వం *28కోట్లు మంజూరి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథ కాల్లో భాగంగా జిల్లాలో 23మంది అబ్దిదారులకు సీఎం చేతుల మీదుగా ఆర్ధిక సహాయం అదింయడం జరిగింది.
ఎస్సెస్సీలో ప్రథమ స్థానం కోసం కృషి
గత సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ సంవత్సరం 100శాతం ఫలితాలు సాదించేందుకు తగు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఆర్వీఎం ద్వారా జిల్లాలో రూ.13.52కోట్లతో పాఠశాలల్లో అదనపు గదులు నిర్మిస్తున్నాం. జిల్లాలో 4,523 అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా 2.69లక్షల మంది గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారం అందజేస్తున్నాం. వీరికి ఒకపూట సంపూర్ణ ఆహారం కింద గుడ్లు, పాలు సరఫరా చేస్తున్నాం. రోడ్లు భవనాల శాఖ ద్వారా రూ.600 కోట్లతో 2341 కిలోమీటర్ల రహదారులను అభివృద్ధి చేస్తున్నాం. పీఆర్ శాఖ ద్వారా రూ.6కోట్లతో 166 కిలోమీటర్ల రోడ్ల పనులు చేపడుతున్నాం. జిల్లాలోని 962 పంచాయతీల్లో 204 పంచాయతీలు ఈ-పంచాయతీలుగా అభివృద్ధిచేసి కంప్యూటరీకరించాం. తెలంగాణ హరిత హారం కార్యక్రమంలో భాగంగా రానున్న నాలుగు సంవత్సరాల్లో నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. ఇప్పటికే 189 నర్సరీల్లో పెంపకం చేసిన 19లక్షల టేకు మొక్కలను రైతులకు అందజేశాం.
పర్యాటక రంగానికి రూ.89 కోట్లు
జల్లాలో పర్యాటక రంగ అభివృద్ధి కోసం రూ.89 కోట్ల అంచనాతో కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. రూ.15 కోట్లతో కాళోజీ కళాక్షేత్రం, రూ.12కోట్లతో శిల్పారామం, రూ.5.20కోట్లతో రామప్ప ఐలాండ్ అంతర్జాతీయ ధ్యాన కేంద్రం, రూ.4కోట్లతో మల్టీపర్పస్ కల్చరల్ కాంప్లెక్స్, రూ.2కోట్లతో ఆర్కియాలజీ మ్యూజియం ఏర్పాటుకు పనులు వివిధ దశల్లో ఉన్నాయి. అదేవిధంగా గణపురం గుళ్ల పునరుద్ధరణ, పాకాల అభివృద్ధి, భద్రకాళి ఆలయంలో అన్నదాన సత్రం కోసం పనులు చేపట్టాలని నిర్ణయించాం. జిల్లాలో ఐటీడీఏ ద్వారా రూ.20.86కోట్లు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ.36.65 కోట్లు, బీసీ కార్పొరేషన్ ద్వారా రూ.4.65 కోట్లను లబ్ధిదారులకు ఆర్థికసాయంగా అందజేశాం. జిల్లా అభివృద్ధిలో పాలు పంచుకుంటున్న డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, స్పీకర్ మధుసుదనాచారి, మంత్రి అజ్మీరా చ ందూలాల్, ఇతర ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు. జిల్లా సర్వతోముఖాభివృద్దికి కృషిచేస్తున్న జిల్లా న్యాయమూర్తి, పోలీస్ ఉన్నతాధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.’ తెలుపుతూ కలెక్టర్ కరుణ ప్రసంగం ముగించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ, డీఐజీ మల్లారెడ్డి, ఎస్పీ అంబర్‌కిషోర్‌జా, కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, వివిధ శాఖల అధికారులు, పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఎన్నో ఏళ్ల పోరాటాల ఫలితంగా స్వరాష్ట్ర కల సాకారమైంది. మిగిలింది బంగారు తెలంగాణగా అభివృద్ధి చేసుకోవడమే.
- వాకాటి కరుణ, కలెక్టర్