సైన్స్ సెంటర్‌కు తాళం | Department of Science and Technology has been locked | Sakshi
Sakshi News home page

సైన్స్ సెంటర్‌కు తాళం

Jan 8 2015 4:22 AM | Updated on Sep 2 2017 7:21 PM

శాస్త్ర, సాంకేతిక అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ప్రాంతీయ సైన్ సెంటర్ తెరుచుకోవడంలేదు.

* నిర్మాణం పూర్తయినా తెరుచుకోని కేంద్రం
* ప్రతి నెల నిర్వహణ ఖర్చులకే రూ. లక్ష
* రెండేళ్లుగా పట్టించుకోని యంత్రాంగం

 
సాక్షి ప్రతినిధి, వరంగల్: శాస్త్ర, సాంకేతిక అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ప్రాంతీయ సైన్ సెంటర్ తెరుచుకోవడంలేదు. రెండేళ్ల క్రితమే నిర్మాణం పూర్తయిన... రాష్ట్రంలోని ఏకైక సెంటర్ ఎప్పటికి అందుబాటులోకి వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. రూ. 3.85 కోట్లతో శాస్త్ర సాంకేతిక శాఖ నిర్మించిన ఈ సైన్స్ సెంటర్ సందర్శకులు అడుగు పెట్టకుండానే... మూత పడే పరిస్థితి వస్తోంది. సందర్శకులు వస్తే వసూలయ్యే ఫీజుతో నడిచే ఈ సెంటర్ మూతపడి ఉండడంతో నిర్వహణ కోసం... వరంగల్ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) ప్రతి నెల లక్ష రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది.
 
 అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన అద్భుతమైన కట్టడం నిర్మాణ లక్ష్యం నెరవేరకుండా పోతోంది.  తెలంగాణ రాష్ట్రంలోని ఏకైక సైన్స్ సెంటర్ ప్రారంభించాలనే ఆలోచన వరంగల్ జిల్లాలోని ప్రజాప్రతినిధులకు, అధికారులకు రాకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement