కాలేజీకి వెళ్లి... తిరిగిరాని విద్యార్థిని | Degree student missing | Sakshi
Sakshi News home page

కాలేజీకి వెళ్లి... తిరిగిరాని విద్యార్థిని

Jul 11 2016 6:06 PM | Updated on Sep 4 2017 4:37 AM

కళాశాలకని వెళ్లిన ఓ యువతి కనిపించకుండాపోయిన సంఘటన కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

సంతోష్‌నగర్ (హైదరాబాద్) : కళాశాలకని వెళ్లిన ఓ యువతి కనిపించకుండాపోయిన సంఘటన కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై పి.ప్రమోద్ కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మీర్‌పేట్ అల్మాస్‌గూడ సీఎంఆర్ కాలనీ ప్రాంతానికి చెందిన బండారి పాండు కూతురు(20) చంపాపేట్‌లోని వేద డిగ్రీ కళాశాలలో చదువుకుంటోంది. ఈ నెల 9వ తేదీన సదరు యువతి కళాశాలకని ఇంట్లో నుంచి బయటికి వెళ్లింది.

అనంతరం తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు కళాశాల విద్యార్థులను వాకబు చేయగా... ప్రతి రోజు కళాశాల వద్ద నరేష్ అనే ఆటో డ్రైవర్ ఆమెను కలిసేవాడని తెలిసింది. దీనిపై తండ్రి పాండు తన కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆచూకీ తెలిసిన వారు 040-27854764, 9490616537 నంబర్లలో సమాచారం అందించాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement