
వధూవరులతో అజయ్‌వర్మ
ఇల్లంతకుంట(మానకొండూర్) : మండల కేంద్రానికి చెందిన మామిడి అంజయ్య ఏకైక కూతురు అనూష పుట్టు మూగ, కరీంనగర్‌కు చెందిన అర్జున్ అనే యువకుడు కూడా పుట్టు మూగ. మండల కేంద్రంలోని వైశ్యభవన్‌లో పెద్దల సమక్షంలో అనూష, అర్జున్ గురువారం వివాహం చేసుకున్నారు.
మానకొం డూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి సొల్లు అజయ్‌వర్మ, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు కొంకటి అనీల్ నవ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. అజయ్‌వర్మ మాట్లాడుతూ ఇద్దరు మూగ వారు కావడంతో వారికి ప్రభుత్వం ఆర్థికసాయం అందించాలని కోరారు.